నగ్నంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళ.. ఎందుకంటే..
పోలీస్ స్టేషన్లోకి రాగానే ఆమెను చూసి షాక్‌కు గురైన పోలీసులు వెంటనే ఆమెకు దుస్తులు అందించి, బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు.
news18-telugu
Updated: May 14, 2019, 10:35 AM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: May 14, 2019, 10:35 AM IST
రాజస్థాన్‌లో షాక్‌కు గురి చేసే సంఘటన జరిగింది. ఓ మహిళ రోడ్డుపై నగ్నంగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన భార్యభర్తలు పొట్టకూటికి రాజస్థాన్ వచ్చారు. అక్కడి చురు జిల్లాలో నివాసం ఉంటున్నారు. భర్త అసోంలో కూలీగా వలస వెళ్లగా, ఆమె అత్త, ఆడబిడ్డతో కలిసి ఉంటోంది. అయితే, వారిద్దరు భర్త లేని సమయంలో ఎంత వేధించినా తట్టుకుంది. అది శ్రుతిమించడంతో ఆమె పట్టలేకపోయింది. ఒక రోజు వారిద్దరు ఆమెపై దాడి చేసి, ఒంటిపై దుస్తులను చించేశారు. దీంతో నగ్నంగానే రోడ్డుపై నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు బయలు దేరింది. ఇది చూసిన కొందరు స్థానికులు ఆమెకు సహాయం చేయాల్సింది పోయి.. మొబైల్‌తో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పోలీస్ స్టేషన్లోకి రాగానే ఆమెను చూసి షాక్‌కు గురైన పోలీసులు వెంటనే ఆమెకు దుస్తులు అందించి, బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. అయితే, ఆమె పోలీస్ స్టేషన్‌కు వచ్చే దారిలో నగ్నంగా ఉందని కూడా చూడకుండా.. ఫోటోలు, వీడియోలు తీసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు, సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డైన సన్నివేశాలను తొలగించారు.

ఏపీలో దారుణం... మూడు నెలల గర్భిణికి ఉరివేసి...
పోలీసులను గన్‌తో కాల్చబోయారు.. సజ్జనార్ ప్రెస్‌మీట్..
మరో ఘోరం.. గిరిజన బాలికను కిడ్నాప్ చేసి 4 నెలలుగా అత్యాచారం
‘దిశ’ హీరో వీసీ సజ్జనార్ ట్రాక్ రికార్డు ఇదీ..
మంటల్లో కాలిపోతూనే పోలీసులకు ఫోన్.. ఉన్నావ్ కేసులో సంచలన విషయాలు
పోలీస్ పైశాచిక ఆనందం... మహిళ మృతదేహంతో...
Loading...