కామవాంఛ తీర్చుకోవడానికి యువకుడికి కూతుర్ని ఎరవేసిన తల్లి...

ఆ పెళ్లికొడుకు చెప్పిన విషయం విని.. పోలీసులు కంగుతిన్నారు. తనకు ఆ యువతితో అసలు ఎలాంటి సంబంధం లేదని ఆ యువకుడు చెప్పాడు.

news18-telugu
Updated: September 13, 2019, 7:37 PM IST
కామవాంఛ తీర్చుకోవడానికి యువకుడికి కూతుర్ని ఎరవేసిన తల్లి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ యువకుడితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్న మహిళ.. అతడిని తనకు పర్మినెంట్‌గా దక్కించుకోవడానికి భారీ కుట్ర చేసింది. ఏకంగా తన సొంత కూతురిని ఎరగా వేసింది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యూరుకు చెందిన ఓ యువతి ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసింది. తమ గ్రామానికి చెందిన ఓ యువకుడు తనను ప్రేమించి, మోసం చేశాడని, ఇప్పుడు మరో యువతితో పెళ్లిపీటలు ఎక్కాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ యువతిని వెంటబెట్టుకుని పెళ్లిమండపానికి వెళ్లారు. అయితే, అక్కడకు వెళ్లీ వెళ్లగానే ఆ యువతి పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టింది. ‘నన్ను మోసం చేసి.. ఈ పెళ్లి చేసుకుంటావా?, ఇదంతా న్యాయమేనా?’ అంటూ ఏడుపులు, పెడబొబ్బలు పెట్టింది. దీంతో పోలీసులు ఆమెను సముదాయించి.. పెళ్లికొడుకును పక్కు పిలిచి విషయం ఆరా తీశారు.

ఆ పెళ్లికొడుకు చెప్పిన విషయం విని.. పోలీసులు కంగుతిన్నారు. తనకు ఆ యువతితో అసలు ఎలాంటి సంబంధం లేదని ఆ యువకుడు చెప్పాడు. కానీ, ఆమె తల్లితో లైంగిక సంబంధం ఉందని చెప్పేసరికి పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. ఇంకొంచెం గట్టిగా ఆరా తీస్తే.. ఆ తల్లి గురించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా ఆ తల్లి ఆడించిన గేమ్ అని తెలుసుకున్నారు. ఆ యువకుడితో లైంగిక సంబంధంలో మునిగిపోయిన మహిళ.. అతడికి పెళ్లి అవుతుండడంతో తట్టుకోలేకపోయింది. అతడితో లైంగిక సంబంధం కొనసాగించడానికి ఒకే ఒక మార్గం ఉందని ఆలోచించింది. తన కూతురికే కట్టబెడితే.. ఇంట్లోనే ‘పని’ కానివ్వొచ్చని ప్లాన్ చేసింది. అయితే, అందుకు కూతుర్ని కూడా ఒప్పించింది. అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పెళ్లి రద్దు అవుతుంది కాబట్టి, కచ్చితంగా తన కూతురితో పెళ్లవుతుందని అంచనా వేసింది. అయితే, ఆమె ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు