అమ్మతనానికి మాయని మచ్చ.. 14 రోజుల బిడ్డను మూడు అంతస్థుల భవనం నుంచి పడేసిన మహిళ

భర్తతో గొడవల కారణంగా ఏకంగా తన 14 రోజుల కుమారుడిని కిరాతకంగా చంపుకున్న ఓ మహిళ తీరు విస్మయం కలిగిస్తోంది.

news18-telugu
Updated: November 14, 2020, 9:40 PM IST
అమ్మతనానికి మాయని మచ్చ.. 14 రోజుల బిడ్డను మూడు అంతస్థుల భవనం నుంచి పడేసిన మహిళ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తమ ప్రాణాలుపణంగా పెట్టయిన తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని మహిళలు భావిస్తుంటారు. అలాంటి వాళ్లెందరి గురించో మనం విన్నాం. కానీ భర్తతో గొడవల కారణంగా ఏకంగా తన 14 రోజుల కుమారుడిని కిరాతకంగా చంపుకున్న ఓ మహిళ వ్యవహారం విస్మయం కలిగిస్తోంది. హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో తన కడుపున పుట్టిన 14 రోజులు పసిగుడ్డును కన్నతల్లే మూడంతస్తుల భవనం మీద నుంచి కింద పడేసింది ఓ మహిళ. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతే నగర్ డివిజన్‌లో జరిగింది.

కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన వేణుగోపాల్ కు ఫతేనగర్ డివిజన్ లోని నేతాజీ నగర్ కు చెందిన లావణ్య 2016 లో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు ఆ తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.అయితే ఈ మధ్యన లావణ్య మళ్లీ గర్భవతి అయింది. ఆమె కొద్ది రోజుల క్రితం డెలివరీ కోసం తన పుట్టింటికి వచ్చింది. అయితే భర్తతో గొడవలు జరగడంతో మళ్ళీ ఎలకల మందు తినడంతో ఆమె ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆస్పత్రిలో చేరిన రెండో రోజే ఆమె మరో మగబిడ్డకు జన్మనిచ్చింది.

అయినా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈమె 14 రోజులు మగబిడ్డను నిన్న సాయంత్రం తాము నివాసముంటున్న మూడో అంతస్తు మీద నుంచి కిందకు తోసేసింది. పాపం అంత పైనుంచి కింద పడడంతో ఆ బిడ్డ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంత కష్టం వచ్చినా.. కడుపున పుట్టిన బిడ్డను అంత కిరాతకంగా చంపుకున్న మహిళపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: November 14, 2020, 9:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading