హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG : లైంగిక వేధింపులు..కదులుతున్న రైళ్లో నుంచి మహిళను కిందకి తోసేశాడు

OMG : లైంగిక వేధింపులు..కదులుతున్న రైళ్లో నుంచి మహిళను కిందకి తోసేశాడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Woman thrown out of moving train : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిన్నారులపై,మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై,మహిళపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు.

ఇంకా చదవండి ...

Woman thrown out of moving train : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిన్నారులపై,మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై,మహిళపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా లైంగిక వేధింపులను(Molestation) ప్రతిఘటించిన మహిళను కదులుతున్న రైలు నుంచి బయటకు తోసివేశాడు ఓ ప్రయాణికుడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఛత్తర్‌ పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.

ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh)లోని బండా జిల్లాకు చెందిన 25 ఏళ్ల మహిళ..మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లోని ఛతర్ పూర్‌ జిల్లాలో ఉన్న బాగేశ్వర్ ధామ్ ఆలయం సందర్శనకు వెళ్లింది. ఆలయ సందర్శన అనంతరం బుదవారం ఉత్తరప్రదేశ్‌లోని సొంతూరుకు రైలులో తిరుగు ప్రయాణమైంది. అయితే రాత్రి వేళ ఓ ప్రయాణికుడు ఆ మహిళను లైంగికంగా వేధించాడు. ఆమె ప్రతిఘటించడంతో మధ్యప్రదేశ్‌ లోని ఖజురహో, ఉత్తప్రదేశ్‌లోని మహోబా మధ్య రాజ్‌నగర్‌ ప్రాంతంలో కదులుతున్న రైలు(Train)నుంచి బయటకు తోసేశాడని జబల్‌ పూర్ ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP)సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)వినాయక్ వర్మ తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన తర్వాత, మహిళను ఛతర్‌ పూర్‌ లోని జిల్లా ఆసుపత్రిలో చేర్చడం జరిగిందని, అక్కడ ఆమె చికిత్స పొందుతోందని తెలిపారు. నిందితుడిని గుర్తించామని, పోలీసులు అతడిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారని వర్మ తెలిపారు. సంఘటన తర్వాత, ఖజురహో పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని,తదుపరి విచారణ కోసం కేసుని రేవా జిఆర్‌పి స్టేషన్‌కు బదిలీ చేయబడిందని ఓ అధికారి తెలిపారు.

ALSO READ Fake Baba : బాబా బాగోతం బట్టబయలు..19 ఏళ్లుగా మహిళపై,ఇప్పుడు ఆమె కూతుళ్లపై..వీడి ఖాతాలో ఇంకెందరో!

మరోవైపు, . రాజస్థాన్ లోని (Rajasthan)భరత్ పుర్ లో దారుణ మైన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. హర్యానాలోని పున్హానా ప్రాంతంలో 2019 మే 25వ తేదీన రాజ‌స్థాన్ కు చెందిన ఓ వ్య‌క్తితో బాధిత మ‌హిళ‌కు వివాహం జ‌రిగింది. కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఈ క్రమంలో, అత్తమామలు కట్నం కోసం (Dowry harassment) వేధించడం మొదలుపెట్టారు. ప్రతి రోజు కట్నం తేవాలని ఆమెను మానసికంగా హింసించే వారు. కాగా, ఆమెకు... 1.5 లక్షల నగదు, బుల్లెట్ బైక్ ఇవ్వాలని అత్త మామ, భ‌ర్త‌ డిమాండ్ చేశారు. వీరి హింసలను తాళలేక ఆ మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత.. కొన్ని నెలలపాటు ఆమె అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత.. పెద్దల ఎదుట బాగా చూసుకుంటానని చెప్పించి తిరిగి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. కానీ కొన్ని రోజులకే మరలా అత్తింటి వారు (Harassed woman) వేధింపులకు పాల్పడటం మొదలు పెట్టారు. ఒక రోజు భర్త.. తనకు తెలిసిన వారితో ఆమెను పనికి పంపాడు. అతను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు.

ALSO READ Shocking : భర్త సోదరుడితో భార్య వివాహేతర సంబంధం..అది తెలిసిన భర్త ఏం చేశాడో తెలుసా

ఆమె గట్టిగా కేకలు వేసి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో భార్య మీద మరింత కోపం పెంచుకున్నాడు. ఒక రోజు భర్త.. మరీ దిగజారీ ప్రవర్తించాడు. తన బంధువులను ఇంటికే పిలిచాడు. తన ఎదుటే భార్యను అత్యాచారం (Rape on wife) చేయించాడు. ఈ దారుణాన్ని ఫోన్ లో రికార్డు కూడా చేశాడు. ఆ తర్వాత.. ఈ వీడియోలను అడల్ట్ సైట్ లో పెడతున్నట్లు తెలిపాడు. నువ్వు ఎలాగో డబ్బులు ఇవ్వవు.. ఇలాగైన డబ్బులు సంపాదిస్తానంటూ ఆమెతో అసహ్యామైన మాటలు మాట్లాడడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు జరిగిన దారుణాన్ని తన పుట్టింటికి వారికి తెలిపింది. వెంటనే వారు సమీపంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Madhya pradesh, Train, WOMAN

ఉత్తమ కథలు