WOMAN THRASHED FORCED TO CARRY HUSBAND ON SHOULDERS FOR RELATIONSHIP WITH ANOTHER MAN IN MADHYAPRADESH
Video : భర్తను వదిలి ప్రియుడు ఇంటికి..ఆదివాసీ మహిళను వివస్త్రను చేసి చితకబాది..ఊరంతా అలా తిప్పి..
ప్రతీకాత్మక చిత్రం
Extramarital Affair : మరో వ్యక్తితో వివాహేతర సంబంధం(Extramarital Affair) పెట్టుకుందన్న కారణంతో ఓ గిరిజన మహిళపై(Traibal Woman) అమానవీయంగా దాడి చేశారు గ్రామస్తులు.
Extramarital Affair : మరో వ్యక్తితో వివాహేతర సంబంధం(Extramarital Affair) పెట్టుకుందన్న కారణంతో ఓ గిరిజన మహిళపై(Traibal Woman) అమానవీయంగా దాడి చేశారు గ్రామస్తులు. ఆమె భర్తతో సహా కొందరు గ్రామస్తులు నడివీధిలో ఆమెను బహిరంగంగా చితకబాదారు. అంతేకాకుండా, తన భర్తను భుజాలపై మోస్తూ గ్రామమంతా తిరిగే విధంగా ఆమెకు గ్రామస్తులు శిక్ష విధించారు. . ఈ ఘటన మధ్యప్రదేశ్(Madhyapradesh) రాష్ట్రంలోని దేవాస్ జిల్లాలోని బోర్పాడవ్ గ్రామంలో ఆదివారం జరిగింది.
దేవాస్ జిల్లాలోని బోర్పాడవ్ గ్రామానికి చెందిన బాధితురాలు... అదే గ్రామానికి చెందిన హరీ సింగ్ అనే వ్యక్తితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే గత నెల 24న ఆమె ఇంటి నుంచి పరారై గుట్టుగా ప్రియుడి ఇంట్లో నివసిస్తోంది. అయితే భార్య కనిపించకపోవడంపై ఆందోళన చెందిన భర్త మంగీలాల్ ఆమె కోసం వెతికాడు. అయినా భార్య ఎక్కడా కనపించకపోవడంతో పోలీసులకు కంప్లెయింట్ చేశాడు. అయితే ఆదివారం రోజున ఎందుకో అనుమానం వచ్చి హరీ సింగ్ ఇంటికి వచ్చిన మంగీలాల్.. ఓ గదిలో తలదాచుకుంటున్న భార్యను చూశాడు. ఈ విషయం గ్రామస్థులకు తెలిసింది. ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు నడివీధిలో బహిరంగంగా వారిని చితకబాదారు. బాధితురాలిని వివస్త్రను చేసిన దాడి చేశారు. అంతేగాక, తన భర్తను భుజాలపై మోస్తూ గ్రామమంతా తిరిగే విధంగా ఆమెకు గ్రామస్తులు శిక్ష విధించారు. . అనంతరం ఆమెకు, ప్రియుడికి చెప్పులదండ వేసి చితకబాదారు.
గ్రామస్తులు ఆ మహిళను చెంప దెబ్బలు కొట్టడం, తన భర్తను భుజాలపై మోస్తుండగా ఆమెను వారంతా దుర్భాషలాడుతూ, అవమానిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో.. ఆ మహిళతోపాటు ఆమె ప్రియుడు హరి సింగ్ భిలాలా అనే వ్యక్తికి చెప్పుల దండలు వేసి వారిని స్థానికులు అవమానిస్తున్న దృశ్యాలు కనిపించాయి. భిలాలా ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు..బాధితులపై దాడి చేసిన 11 మందిపై కేసు నమోదు చేశారు. నిందితులు ఆ మహిళ దుస్తులను చింపివేయడంతోపాటు ఆమెను దుర్భాషలాడుతూ ఘోరంగా అవమానించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి తొమ్మిదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. . ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.
In Madhya Pradesh's Dewas district, people brutally beat up a "Tribal Woman" just because she went with her lover. Aren't we living in a free country @ChouhanShivraj ?? What was her fault??
Where is NDA's candidate for President election, Draupadi Murmu?? Why is she SILENT?? pic.twitter.com/o3afyRtW6U
— Rajasthan Congress Sevadal (@SevadalRJ) July 4, 2022
మహిళపై గ్రామస్తులు చేసిన అరాచకానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన రాజస్తాన్ కాంగ్రెస్...మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో, ప్రేమికుడితో వెళ్లిందనే కారణంతో ప్రజలు "ఆదివాసి మహిళ"ను దారుణంగా కొట్టారు. మనం స్వేచ్ఛా దేశంలో జీవిస్తున్నాం కదా అని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ని ప్రశ్నించింది. ఆమె చెసిన తప్పేంటని...ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎక్కడున్నారు..ఆమె ఎందుకు ఈ ఘటనపై మౌనంగా ఉంది అని కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.