సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఫోన్ నెంబర్ అశ్లీల వెబ్‌సైట్ లో ప్రత్యక్షం...క్యాబ్ డ్రైవర్ నిర్వాకం...

టే బాధిత మహిళకు ఈ మధ్యకాలంలో తరచూ అశ్లీల మెసేజ్ లు, వీడియోలు రావడం మొదలయ్యాయి. అయితే పొరపాటున ఎవరైనా పంపుతున్నారేమోనని పట్టించుకోలేదు. అయితే ఒకే నంబర్ నుంచి కాకుండా వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్ లు రావడం మొదలయ్యాయి.

news18-telugu
Updated: August 4, 2019, 5:30 PM IST
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఫోన్ నెంబర్ అశ్లీల వెబ్‌సైట్ లో ప్రత్యక్షం...క్యాబ్ డ్రైవర్ నిర్వాకం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేసే యువతికి ఓ క్యాబ్ డ్రైవర్ అశ్లీల మెసేజ్ లు పంపి వేధిస్తున్న ఘటన, గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బాధిత మహిళ గురుగ్రామ్ లో ని ఆర్థి ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఇదిలా ఉంటే బాధిత మహిళకు ఈ మధ్యకాలంలో తరచూ అశ్లీల మెసేజ్ లు, వీడియోలు రావడం మొదలయ్యాయి. అయితే పొరపాటున ఎవరైనా పంపుతున్నారేమోనని పట్టించుకోలేదు. అయితే ఒకే నంబర్ నుంచి కాకుండా వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్ లు రావడం మొదలయ్యాయి. అంతే కాదు కొందరు వేర్వేరు వ్యక్తులు కాల్ చేసి ఆమెతో అసభ్యంగా మాట్లాడటం స్టార్ట్ చేశారు. అంతేకాదు.. యువతికి పలువురు విటులు సైతం ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టారు. దీంతో వేధింపులు శృతిమించడంతో చివరగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు బుక్ చేసుకొని దర్యాప్తు చేయగా, ఆమె కాల్ హిస్టరీ ఆధారంగా ఖాకీలు తీగలాగారు.

ఇదిలా ఉంటే  గురుగ్రామ్ లోని ఓ క్యాబ్ డ్రైవర్ ఈ తంతంగం అంతా నడుపుతున్నట్లు గుర్తించారు. అంతే కాదు సదరు డ్రైవర్ క్యాబ్ బుకింగ్ సందర్భంగా మహిళల ఫోన్ నెంబర్లు సేకరించి వారి ఫోన్ నెంబర్లను అశ్లీల వెబ్ సైట్స్‌లో అప్ లోడ్ చేయడంతో పాటు, అసభ్య మెసేజెస్ పంపుతున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకొని ఐపీసీ సెక్షన్ 354 డి, సెక్షన్ 53 కింద కేసు నమోదు చేశారు

First published: August 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు