Home /News /crime /

WOMAN TAKE VIDEO OF HUSBAND COMMITTING SUICIDE IN KOLKATA VB

Husband commit to suicide: తన భర్త చనిపోతున్నట్లు బెదిరిస్తున్నాడని అనుకుంది.. మొబైల్ లో వీడియో తీయమంటే తీసింది.. అంతలోనే దారుణం.. ఎంత పిలిచినా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Husband commit to suicide: ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను ఒప్పించి నాలుగు నెలల క్రితం పెళ్లి కూడా చేసుకున్నారు. వెను వెంటనే ఇద్దరి మధ్య మనస్పర్థలు. అది కాస్త విడాకుల దాకా తీసుకెళ్లింది. భార్య విడాకులు కావాలని అడగడంతో భర్త ఆమెతో వీడియో తీయించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కోల్ కత్తాలో చోటుచేసుకుంది. వివరాలు..

ఇంకా చదవండి ...
    తన భర్త ఉరి వేసుకుని చనిపోతున్నట్లు నటిస్తున్నట్లు అనుకున్న భార్య తన మొబైల్ లో వీడియో తీసింది. కానీ అంతలోనే దారుణం జరిగింది. ఎంత పిలిచినా పలకకపోడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రహించింది. మరణించిన తన భర్త బంధువుల ఫిర్యాదుతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఈ ఘటన జరిగింది. నేహ శుక్ల 22 ఏళ్లు, అమోన్ షా 25 ఏళ్లు ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి నాలుగు నెలల క్రితం డిసెంబర్ 11న పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఇద్దరు ఉ్యదోగం మానేశారు. కొత్తగా తన భర్త అమోన్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అయితే అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక వాగ్వాదం చేసుకుంటూ ఉండేవారు. ఈ గొడవ తట్టుకోలేక కొన్ని రోజులు నేహ ఢిల్లీకి వెళ్లింది. అప్పటి నుంచి ఒక్కడే ఒంటరిగా హౌరాలోనే అమోన్ ఉంటున్నాడు.
    ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన నేహా ఈ నెల 5న కోల్‌కతాకు తిరిగి వచ్చింది.

    ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే భర్తను విడాకుల కోసం కోరింది. నీతో కలిసి ఉండటం తన వల్ల కాదని చెప్పడంతో అమోన్ షాక్ కు గురయ్యాడు. ఆ సమయంలో అతడి తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం వెళ్లూరు వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో విడాకుల కోసం భార్య ఒత్తిడి చేయడంతో అమోన్‌ కు ఏమి చేయాలో అర్థం కాలేదు. తన భార్య ఒత్తిడి పెంచడంతో ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అయితే బెదిరింపు కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా భర్త నటిస్తున్నట్లు నేహా అనుకున్నది. దానిని ఆమె సీరియస్‌గా తీసుకోకపోవడంతో పాటు తన మొబైల్‌లో వీడియో తీసింది . వీడియోతీసిన తర్వాత తేరుకునే లోపే తన భర్త చనిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన కోల్ కత్తా చేరారు.

    ఆమె మొబైల్‌లోని ఈ వీడియోను గమనించిన అమోన్‌ కుటుంబ సభ్యులు నేహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇటీవల ఢిల్లీకి వెళ్లిందని, తాను కూడా వస్తానని భర్త అడిగితే రావద్దని చెప్పిందని వారు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత విడాకుల కోసం నేహా ఒత్తిడి చేసిందని, దీని వెనుక ఏదో ఉన్నదని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు భర్తను పురికొల్పిన భార్యపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime, Crime news, Husband, Husband commit suicide, Kolkata, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు