• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • WOMAN SUSPICIOUS DEATH IN LOCKED HOME FOUND AFTER THREE DAYS IN NELLORE DISTRICT FULL DETAILS HERE HSN

అర్ధరాత్రి తీవ్ర దుర్వాసన.. ఎలుకో, పిల్లో చనిపోయి ఉంటుందనుకున్నారు.. కానీ వాసన వస్తున్న వైపు వెతుక్కుంటూ వెళ్తే..

అర్ధరాత్రి తీవ్ర దుర్వాసన.. ఎలుకో, పిల్లో చనిపోయి ఉంటుందనుకున్నారు.. కానీ వాసన వస్తున్న వైపు వెతుక్కుంటూ వెళ్తే..

ప్రతీకాత్మక చిత్రం

అర్ధరాత్రి ఇంట్లో వాళ్లకు తీవ్ర దుర్వాసన వచ్చింది. ఎలుకో, పిల్లో ఎక్కడో చనిపోయి ఉంటుందనుకున్నారు. ఇంట్లోనూ, ఇంటి ఆవరణలోనూ వెతికారు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. ఆ వాసన తమ ఇంట్లోంచి రావడం లేదనీ, పక్కింట్లోంచి వస్తోందని గ్రహించారు.

  • Share this:
    సరిగ్గా అర్ధరాత్రి సమయం. ఓ ఇంట్లో వాళ్లకు తీవ్ర దుర్వాసన వచ్చింది. ఎలుకో, పిల్లో ఎక్కడో చనిపోయి ఉంటుందనుకున్నారు. ఇంట్లోనూ, ఇంటి ఆవరణలోనూ వెతికారు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. ఆ వాసన తమ ఇంట్లోంచి రావడం లేదనీ, పక్కింట్లోంచి వస్తోందని గ్రహించారు. తీరా అక్కడకు వెళ్లి చూస్తే ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. ఆ ఇంట్లోనే ఏదో జరిగి ఉంటుందన్న అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి అంత రాత్రిలోనూ తలుపులు బద్దలు కొట్టి చూస్తే లోపల ఓ మహిళ మృతదేహం కనిపించింది. చనిపోయి చాలా రోజులు అయి ఉంటుందనీ, మృతదేహం కుళ్లిపోయినందునే వాసన వస్తోందని గ్రహించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లాంకు చెందిన రమణమ్మ అనే 54 ఏళ్ల మహిళ బీబీ నగర్లోని తన చెల్లెలు ఇంట్లో ఉంటోంది. పాచి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మగాళ్లతో సన్నిహితంగా ఉంటోంది. మార్చి 21వ తారీఖున రమణమ్మ ఓ మహిళతో కలిసి బయటకు వెళ్లింది. ఆ తర్వాత కొద్ది సేపటికే మళ్లీ ఇంటికి వచ్చింది. మరుసటి రోజు నుంచి రమణమ్మ కనిపించకుండా పోయింది. ఆమె వ్యవహారి శైలి గురించి తెలిసిన ఆమె సోదరి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కొద్ది రోజుల్లో మళ్లీ వస్తుందిలే అనుకుంది.
    ఇది కూడా చదవండి: ఏడాది క్రితం పెళ్లయిన కూతురిని ఇంటికి పిలిచి.. అందరం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నామని చెప్పిన తండ్రి.. చివరకు..

    అయితే మార్చి 24వ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమె సన్నిహితంగా ఉంటున్న ఓ వ్యక్తి ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడం మొదలయింది. పక్కింట్లో వాళ్లు దీన్ని గమనించారు. తాళం వేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఇంటి తలుపులు బద్దలు కొట్టారు. ఇంట్లోకి వెళ్లిచూస్తే రమణమ్మ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో వెంటనే ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతికి, ఆమెతో సన్నిహితంగా ఉంటున్న ఇద్దరు మనుషులే కారణం అయి ఉంటారని రమణమ్మ చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా కనిపించకుండా పోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    ఇది కూడా చదవండి: మేడమీద గదిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. అర్ధరాత్రి అక్క అదృశ్యం.. తల్లిదండ్రులతో కలిసి ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్తే..
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు