కోరిక తీర్చాలంటూ భర్త స్నేహితుడి వేధింపులు...భార్య ఆత్మహత్యాయత్నం

news18-telugu
Updated: July 14, 2019, 8:41 AM IST
కోరిక తీర్చాలంటూ భర్త స్నేహితుడి వేధింపులు...భార్య ఆత్మహత్యాయత్నం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 14, 2019, 8:41 AM IST
లైంగిక వేధింపుల నేపథ్యంలో అర్ధరాత్రి గుంటూరులో మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను GGHకి తరలించారు.గుంటూరు జిల్లా పట్టాభిపురానికి చెందిన కె. ఝాన్సీ రాణి భర్తతో కలిసి నివాసం ఉంటుంది. అయితే గతకొంతకాలంగా భర్త స్నేహితుడు తన్నీరు సాంబశివరావు అనే వ్యక్త ఝాన్సీని లైంగికంగా వేధించడం మొదలు పెట్టారు. సాంబశివరావుది చిలకలూరిపేటకు చెందిన మురళీకృష్ణ మద్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా అతడు కోరిక తీర్చాలంటూ ఝాన్సీని వేధిస్తున్నాడు.

బాధితురాలు ఝాన్సీ రాణి


దీనిపై బాధితురాలు భర్తతో కలిసి.. పట్టిభిపురం పీఎస్‌లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే పోలీసులు సాంబశివరావుపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా... పోలీసులు తనపై, తన భర్త పై కూడా కేసు నమోదు చేశారని ఝాన్సీ తీవ్ర మనస్తాపానికి గురైంది.  శనివారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన భర్త సత్య ఆమెను వెంటనే గుంటూరు gghకి తరలించారు.

First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...