అక్రమ సంబంధం.. 28 ఏళ్ల మహిళను వివస్త్రను చేసి.. నడిరోడ్డు మీద..

గతంలో ఆమె ఇంటి నుంచి ఓ వ్యక్తితో పారిపోయి కొన్నాళ్ల తర్వాత తిరిగి వచ్చినట్టు గ్రామస్తులు చెబుతున్నారు.

news18-telugu
Updated: October 20, 2019, 5:31 PM IST
అక్రమ సంబంధం.. 28 ఏళ్ల మహిళను వివస్త్రను చేసి.. నడిరోడ్డు మీద..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పశ్చిమ బెంగాల్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఆమెను గ్రామస్తులు బీభత్సంగా హింసించారు. ఆమెను నడి రోడ్డు మీద కొడుతూ దుస్తులు విప్పేసి.. నగ్నంగా ఊరేగించారు. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల మహిళకు చెందిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్ 17న ఓ వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ చనిపోయిన వ్యక్తికి, ఈ మహిళకి మధ్య అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలే కాదు, అదే నిజమంటూ చనిపోయిన వ్యక్తి భార్య ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంది. ఆమె బాధ భరించలేకే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది.

అక్టోబర్ 18న సూసైడ్ చేసుకున్న వ్యక్తి మృతదేహం గ్రామానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో కొందరు ఆ మహిళ మీద పడి దాడి చేశారు. అంతటితో ఆగలేదు. కొందరు దాడి చేస్తుంటే, మరికొందరు ఆమె ఒంటి మీద దుస్తుల్లేకుండా చించేశారు. అనంతరం కొడుతూ గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

గ్రామంలో ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాధితురాలిని కాపాడారు. చనిపోయిన వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో ఆమె ఇంటి నుంచి ఓ వ్యక్తితో పారిపోయి కొన్నాళ్ల తర్వాత తిరిగి వచ్చినట్టు గ్రామస్తులు చెబుతున్నారు.

ప్రధాని మోదీతో బాలీవుడ్ ప్రముఖుల సమావేశం

First published: October 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading