నిర్దాక్షిణ్యంగా చంపేశారు.. పెళ్లయి నాలుగు నెలలు కాకుండానే..

శుక్రవారం రాత్రి కూడా భర్త గోపాల్ ఆమెను తీవ్రంగా వేధించాడు.కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుంచి గెంటేశాడు. అయితే తాను,గోపాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నామని.. కట్నం ఎందుకివ్వాలని భాగ్యమ్మ ఇంటి ముందే కూర్చుంది.

news18-telugu
Updated: October 12, 2019, 11:59 AM IST
నిర్దాక్షిణ్యంగా చంపేశారు.. పెళ్లయి నాలుగు నెలలు కాకుండానే..
మృతురాలు,మృతురాలి తల్లి
news18-telugu
Updated: October 12, 2019, 11:59 AM IST
అదనపు కట్నం వేధింపులకు ఓ యువతి బలైపోయింది. కుటుంబ సభ్యులతో కలిసి భర్తే భార్యను హతమార్చాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన ఈబూతి లక్ష్మయ్య,భాగ్యమ్మ దంపతుల కుమార్తె చెంచులక్కకు అదే గ్రామానికి చెందిన బాలన్న-లక్ష్మీదేవి దంపతుల మూడో కుమారుడు గోపాల్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహమైన మరుసటిరోజు నుంచే అదనపుకట్నం వేధింపులు మొదలయ్యాయి. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి కూడా భర్త గోపాల్ ఆమెను తీవ్రంగా వేధించాడు.కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుంచి గెంటేశాడు. అయితే తాను,గోపాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నామని.. కట్నం ఎందుకివ్వాలని భాగ్యమ్మ ఇంటి ముందే కూర్చుంది. దీంతో ఆగ్రహించిన గోపాల్.. కుటుంబ సభ్యులతో కలిసి ఆమెపై దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా గొంతు నులిమి చంపేశారు.హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ.. పోలీసుల విచారణలో ఆమెది హత్యేనని తేలింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...