Home /News /crime /

WOMAN STOMACH PAIN LEADS TO ULTRASOUND SCANNING REVEALS SHOCKING RESULT HSN

Woman Stomach Pain: ప్రసవం జరిగిన 77 రోజుల తర్వాత కడుపులో నొప్పి.. ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ లో షాకింగ్ రిజల్ట్..!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఈ సారి ఆ ఆసుపత్రికి కాకుండా వేరే ఆసుపత్రికి వెళ్లారు. కొత్త ఆసుపత్రికి వెళ్లిన తర్వాత ఆమెకు ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ చేశారు. అప్పుడు తెలిసింది ఆమె కడుపునొప్పికి అసలు కారణమేంటన్నది. ఆమె కడుపులో ఉన్నది చూసి డాక్టర్లే షాకయ్యారు.

ఇంకా చదవండి ...
    30 ఏళ్ల ఓ మహిళ. ఇటీవలే ప్రసవించింది. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన పది రోజుల వరకు ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. కానీ సరిగ్గా పదో రోజు ఆమె కడుపులో నొప్పి రావడం మొదలైంది. కారణమేంటా అని దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లింది. వాళ్లు స్కానింగ్ చేసి ఏమీ లేదని చెప్పి కొన్ని మందులు రాసిచ్చారు. కడుపులో రక్తం గడ్డ కట్టడంతోపాటు ఏదో ఒక పదార్థం ఉందన్నది డాక్టర్లు గమనించారు కానీ ఆమెకు చెప్పలేదు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఈ సారి ఆ ఆసుపత్రికి కాకుండా వేరే ఆసుపత్రికి వెళ్లారు. కొత్త ఆసుపత్రికి వెళ్లిన తర్వాత ఆమెకు ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ చేశారు. అప్పుడు తెలిసింది ఆమె కడుపునొప్పికి అసలు కారణమేంటన్నది. ఆమె కడుపులో ఉన్నది చూసి డాక్టర్లే షాకయ్యారు. ఇంతకీ అసలు కథేంటనుకుంటున్నారా.. వెళ్దాం.. అక్కడికే వెళ్దాం..

    ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని న్యూ ఆజాద్ నగర్ కు చెందిన వాజ్ పాయ్ కు రాబీ అనే భార్య ఉంది. ఆ 30 ఏళ్ల రాబీ గతేడాది అక్టోబర్ 17న పండంటి బిడ్డకు ఓ నర్సింగ్ హోమ్ లో జన్మనిచ్చింది. ఆమెకు ఆపరేషన్ చేసి డెలీవరీ జరిపారు. కొద్ది రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చిందామె. ఇంటికొచ్చిన సరిగ్గా పది రోజులకు ఆమెకు కడుపులో నొప్పి రావడం మొదలైంది. కారణం ఏమయి ఉంటుందా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్ల సూచన మేరకు ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ జరిపారు. ఆ రిపోర్టులో కడుపులో గడ్డ కట్టినట్టు, ఏదో పదార్థం ఉన్నట్టు గమనించారు కానీ, ఆ డాక్టర్లు మాత్రం ఆమెకు విషయం చెప్పలేదు. కొన్ని మాత్రలు ఇచ్చి ఆమెను ఇంటికి పంపిచారు. మరికొన్నాళ్లకు.. అంటే డెలివరీ జరిగిన 77 రోజుల తర్వాత ఆమెకు కడుపు నొప్పి మరింత తీవ్రమయింది. ఈసారి వేరే ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లాడు. దీంతో ఆ ఆసుపత్రి వైద్యులు ఆదివారం ఆమెకు ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ చేశారు. మొత్తానికి అసలు సమస్య ఏంటో బయటపెట్టారు.

    ఆమెకు ప్రసవం జరిపినప్పుడు, డాక్టర్ పొరపాటున ఓ గుడ్డ ముక్కను ఆమె కడుపులో పెట్టి కుట్టేశారు. అదే ఆమెకడుపు నొప్పికి మూల కారణమయింది. ఇది కాస్తా బయటపడటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన భార్య ప్రాణాలకు ముప్పు తెచ్చిన వైద్యులను, నర్సింగ్ హోమ్ ను శిక్షించాలని హితేష్ కోరుతున్నాడు. ఈ విషయమై జిల్లా మెజిస్ట్రేట్ కు, సీఎంవోకు, హెల్త్ అధికారులకు హితేష్ ఫిర్యాదు చేశాడు. అయితే ఎన్ని ఫిర్యాదులు చేసినా ఆ నర్సింగ్ హోమ్ పై, ఆ డాక్టర్లపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Doctors, Hospital, Pregnant, Women health

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు