Home /News /crime /

భర్త లేని మహిళపై గ్యాంగ్ రేప్..కన్నతండ్రే రూ.10వేలకు అమ్మేశాడు...

భర్త లేని మహిళపై గ్యాంగ్ రేప్..కన్నతండ్రే రూ.10వేలకు అమ్మేశాడు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బాధిత మహిళ పరిస్థితిని చూసి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ తల్లడిల్లిపోయారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసి సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    కట్టుకున్న భర్త చనిపోయాడు. కన్నతండ్రి కాలయముడయ్యాడు. భర్తను కోల్పోయి ధీనస్థితిలో ఉన్న కూతురుని చేరదీయాల్సిందిపోయి..అంగట్లో సరుకును చేసి అమ్మేశారు. తండ్రి, అత్త కలిసి రూ.10వేలకు బేరమాడి ఓ రాక్షసుడికి ఆమెను అమ్మేశారు. ఆ కిరాతకుడు నిత్యం అత్యాచారంచేస్తూ చిత్రహింసలకు పాల్పడేవాడు. అంతేకాదు తాను అప్పుతీసుకున్నన వ్యక్తుల దగ్గరికి కూడా ఆమెను పంపించేవాడు. అక్కడ సైతం అదే దారుణం..! పశువుల్లా మీద పడి కామవాంఛని తీర్చుకున్నారు. న్యాయం చేస్తారని పోలీసులను ఆశ్రయిస్తే కనీసం పట్టించుకోలేదు. దాంతో దిక్కుతోచని స్థితిలో ఆ మహిళ కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది. యూపీలో ఓ అభాగ్యురాలి ధీనగాధ ఇది..!

    ఉత్తరప్రదేశ్‌లోని హార్పూర్‌లో ఈ దారుణం జరిగింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో మంది ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసు స్టేషన్లోనూ న్యాయం జరగక పోవడంతో ఏప్రిల్ 28న ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేసింది. బాధితురాలు ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 80శాతం కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

    ఐతే ఈ కేసులో పోలీసుల వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. బాధిత మహిళ పరిస్థితిని చూసి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ తల్లడిల్లిపోయారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసి సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలకు పరిహారం చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.DCW జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు కళ్లు తెరిచిన యూపీ పోలీస్ యంత్రాంగం ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 14 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
    First published:

    Tags: Crime, Gang rape, RAPE, Uttar pradesh, Yogi adityanath

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు