Chinthakindhi.RamuChinthakindhi.Ramu
|
news18-telugu
Updated: May 26, 2019, 6:32 PM IST
చైనా ప్రేమికుల దినోత్సవం రోజున మొబైల్ ఫోన్ కొనివ్వలేదనే కోపంతో బాయ్‌ఫ్రెండ్‌ను 52 సార్లు చెంపచెళ్లుమనిపించిన గర్ల్‌ఫ్రెండ్... సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో...
అమ్మాయిని పడేయడం ఎంత కష్టమో... ఇంప్రెస్ అయిన అమ్మాయిని మెయింటెయిన్ చేయడం చాలా కష్టం. తాజాగా ఓ వైరల్ అవుతున్న ఓ వీడియో... గర్ల్‌ఫ్రెండ్ ఉంటే ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుందో చెప్పకనే చెబుతోంది. మొబైల్ ఫోన్ కొనివ్వలేదని... బాయ్‌ఫ్రెండ్‌ను అందరూ చూస్తుండగానే చెంప చెళ్లుమనిపించిందో గర్ల్‌ఫ్రెండ్. అదీ ఒకటో రెండో కాదు... ఏకంగా 52 సార్లు చెంప మీద కొడుతూ తన కోపాన్ని ప్రదర్శించింది. ఆమె అంత చేస్తున్నా అతను రాయిలా నిలబడిపోవడం విశేషం. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ సంఘటన చైనాలో జరిగింది. చైనాలోని సిచువాన్‌లో ఓ వీధిలో తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలిశాడో యువకుడు. మే 20న చైనా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేయసితో కలిసి కాసేపు ఎంజాయ్ చేద్దామనుకుని ఆశగా వచ్చాడు. అయితే ప్రేమికుల రోజు తనకు మొబైల్ ఫోన్ కొనివ్వాలని డిమాండ్ చేసిందా గర్ల్‌ఫ్రెండ్. ఆ విషయం మరిచిపోయాడో లేక డబ్బులు లేక కొనలేకపోయాడో తెలీదు కానీ ఒట్టి చేతులతో ప్రేయసి దగ్గరికి వచ్చాడా ప్రియుడు. దాంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. జనం మధ్యలో ఉన్నామనే విషయం కూడా మరిచిపోయి... బాయ్‌ఫ్రెండ్ చెంపచెళ్లుమనిపించింది. తిడుతూ 52 సార్లు చెంప చెళ్లుమనిపిస్తూనే ఉంది. ఇంత జరుగుతున్నా చుట్టుపక్కలవాళ్లు ఆపడానికి గానీ, అడిగేందుకు గానీ సాహసం చేయలేదు. కొందరు మాత్రం ఈ దృశ్యాలను మొబైళ్లలో రికార్డు చేశారు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు పోలీసులు.
యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న వీడియో ఇదే...
అయితే అమాయకుడైన అతను మాత్రం తన గర్ల్‌ఫ్రెండ్ ఇబ్బందుల్లో పడడం తనకిష్టం లేదని పోలీసులతో వారించాడు. మా విషయంలో పోలీసుల జోక్యం అవసరం లేదని తేల్చేశాడు. అయితే ఇద్దరినీ విడివిడిగా కూర్చొబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు... ఇంటికి పంపించివేశారు. అయితే ఆమెకు అంత కోపం రావడానికి కారణం లేకపోలేదు. కొన్నాళ్లుగా బాయ్‌ఫ్రెండ్‌కు ఆర్థికంగా సాయం చేస్తూ వచ్చిందట సదరు యువతి. అందుకే ఆశగా తనకు ప్రేమికుల రోజు జ్ఞాపికగా కొత్త ఫోన్ కావాలని అడిగిందట. అది కూడా తేకపోవడంతో కోపంతో చెంప చెళ్లుమనిపించిందట. తప్పు చేశాననే భావనతోనే అతను మౌనంగా ఆమె కొడుతున్నా, తిడుతున్నా భరించాడట. ఈ ఇద్దరి ప్రేమకథ ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ అయ్యింది.
First published:
May 26, 2019, 6:31 PM IST