Home /News /crime /

WOMAN SHOCKED TO KNOW ABOUT THE PERSON WHOM SHE WANT TO GO FOR DATE AK

తెలియని వ్యక్తితో డేటింగ్‌కు రెడీ.. ఓసారి వాడెవడో చూద్దామని గూగుల్లో సెర్చ్.. అంతే కాళ్ల కింద భూమి కంపించింది...

బాధితురాలు

బాధితురాలు

Online Dating: తాను డేటింగ్‌కు వెళ్లాలనుకుంటున్న వ్యక్తి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని భావించింది కార్ట్‌వెల్. అతడి గురించి గూగుల్‌లో సెర్చ్ చేసింది.

    తమకు ఏ మాత్రం పరిచయం లేని కొత్తవారితో డేటింగ్‌కు వెళ్లడం అనే సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు ఈ రకంగా తమ డేటింగ్ పార్టనర్‌ను ఎంచుకుంటుంటారు. అయితే అమెరికాలోని ఓ యువతి ఈ రకంగానే తన డేటింగ్ పార్టనర్‌ను ఎంచుకుని.. ఆ తరువాత అసలు విషయం తెలిసి షాక్‌కు గురైంది. ఏ మాత్రం వివరాలు తెలుసుకోకుండా కొత్త వ్యక్తులతో డేటింగ్ అంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం అప్పుడు కానీ ఆమెకు తెలియరాలేదు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని షైనాకు చెందిన కార్ట్‌వెల్ అనే మహిళ.. ఓ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తోంది వీకెండ్‌లో డేటింగ్ కోసం పార్టనర్‌ను వెతికిన కార్ట్‌వెల్.. హింగే అనే వ్యక్తిని ఆన్ లైన్ డేటింగ్ సైట్ ద్వారా కలుసుకుంది. ఇద్దరూ ఛాటింగ్ ద్వారా ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకున్నారు. డేటింగ్‌కు ఓకే అనుకున్నారు.

    అయితే తాను డేటింగ్‌కు వెళ్లాలనుకుంటున్న వ్యక్తి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని భావించింది కార్ట్‌వెల్. అతడి గురించి గూగుల్‌లో సెర్చ్ చేసింది. తనకున్న సమాచారంలో కాస్త లోతుగా వెళ్లి.. అతడి గురించి సెర్చ్ చేసింది. ఈ క్రమంలోనే హింగే గురించి ఆమెకు కీలకమైన సమాచారం తెలిసింది. ఆ సమాచారం నిజమే అని ధృవీకరణ కూడా చేసింది. ఆ క్షణమే ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. సాధారణంగా డేటింగ్‌కు వెళ్లే కార్ట్‌వెల్‌ను అంతలా కలవరపాటుకు గురి చేసిన విషయం ఏమిటంటే.. ఆమె డేటింగ్‌కు వెళ్లాలనుకున్న హింగే ఓ కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

    అలా తాను ఏ మాత్రం పరిచయం హింగే లాంటి వ్యక్తితో డేటింగ్‌తో వెళితే.. ఏం జరుగుతుందో ఊహించుకుని కార్ట్‌వెల్.. ఒక్కసారిగా వణికిపోయింది. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని పంచుకుంటూ, అపరిచిత వ్యక్తితో డేటింగ్‌కు వెళ్లే ముందు ఈ విషయాలను తెలుసుకోవాలని కార్ట్‌వెల్ సూచించింది.

    Viral News: ఈ మహిళ కోరిక వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.. ఇలా కూడా ఉంటారా ?

    Dangerous Son: ఇలాంటి కొడుకు ఎవరికీ ఉండొద్దు.. డబ్బుల కోసం క్రిమినల్ ఆలోచన.. కానీ చివరకు..

    చాలా సార్లు ఎదుటి వ్యక్తి నిజాలు సోషల్ మీడియా ద్వారా బయటపెట్టడం లేదని, అందుకే గూగుల్ సహాయంతో దీనిపై పూర్తి విచారణ జరిపించాలని కార్ట్‌వెల్ చెప్పింది.ఆమెకు ఎదురైన కష్టాలపై సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. ఆయన మనసును చాలా మంది కొనియాడుతుండగా, మరికొందరు మాత్రం ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కారణాలన్నింటికీ ఆమె ఎప్పుడూ ఆన్‌లైన్ డేటింగ్‌ను ఆశ్రయించదని ఒక వినియోగదారుడు తెలిపాడు
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Dating, Dating App

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు