ఓ వ్యక్తి తన భార్యకు తెలియకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం కొసాగిస్తున్నాడు. ఆమెతో గుట్టుచప్పుడు కాకుండా రాసలీలలు సాగిస్తున్నాడు. అయితే ఈ విషయం అతని భార్యకు తెలిసింది. దీంతో అక్కడ ఊహించని పరిణామాలు చోటుచేసుకన్నాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) డార్జిలింగ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. డార్జిలింగ్ జిల్లాలోని నక్సల్బరీలోని (Naxalbari) కిరణ్ చంద్ర టీ గార్డెన్ (Kiranchandra tea garden) ప్రాంతంలో రూపశ్రీ సర్కార్ దాస్(39)తన భర్త సుదీప్త దాస్ కలిసి నివాసం ఉంటుంది. కొన్నేళ్లు వారి జీవితం హ్యాపీగా సాగింది. సుదీప్త దాస్ కిరణ్ చంద్ర టీ గార్డెన్‌లో హెడ్ కర్ల్క్‌గా పనిచేసేవాడు. వీరికి ఒక బిడ్డ కూడా ఉంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం నక్సల్బరీ టీ గార్డెన్ ప్రాంతంలోని జాబ్రా సెక్షన్‌కు సుజాత బారాక్‌తో రూపశ్రీ భర్త వివాహేతర సంబంధం (Extramarital Affair) పెట్టుకున్నాడు. సుజాతకు కూడా ఇదివరకే వివాహం జరిగింది.
కొన్నాళ్లపాటు సుదీప్త దాస్, సుజాతకు మధ్య వివాహేతర సంబంధం సీక్రెట్‌గా సాగింది. కొన్నాళ్లకు ఈ విషయం కాస్తా జనాలకు తెలిసింది. నెమ్మదిగా ఈ విషయం సుదీప్త దాస్ భార్య రూపశ్రీకి కూడా తెలిసిపోయింది. దీంతో వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఆమె భావించింది. దుర్గా మాత నవరాత్రుల వేళ.. ఆమె తన భర్తను సుజాతతో ఉన్నప్పుడు పట్టుకోవాలని బలంగా నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే సుజాత, సుదీప్త దాస్ ఇద్దరు బెడ్ మీద రాసలీలలు సాగిస్తుండగా.. రూపశ్రీ అక్కడికి చేరుకుని వారి బాగోతాన్ని బట్టబయలు చేసింది.
Bhoomi Trivedi: ప్రముఖ సింగర్ భూమిపై ఎఫ్‌ఐఆర్ నమోదు.. మరో సింగర్ రాహుల్‌పై కూడా.. కేసు ఏమిటంటే..
భర్త చేసిన పనికి తీవ్ర ఆవేశానికి లోనైన రూపశ్రీ.. కిరోసిన్‌ను వారిద్దరిపై పోలిస నిప్పంటించింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో.. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో చుట్టుపక్కల వాళ్లు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుదీప్త దాస్, సుజాతలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ (North Bengal Medical College) అండ్ హాస్పిటల్‌కు రిఫర్చ చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో సుజాత మరణించగా.. రూపశ్రీ భర్త సుదీప్త దాస్ పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటనకు సంబందించి సూజత కుటుంబ సభ్యులు నక్సల్బరీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నక్సల్బరీ పోలీసులు.. నిందితురాలు రూపశ్రీని అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను సిలిగురి కోర్టులో హాజరుపరిచారు. అక్కడి న్యాయమూర్తి ఆమెకు జ్యూడిషియల్ కస్టడీ విధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.