హోమ్ /వార్తలు /క్రైమ్ /

Viral Video: తన ఇంటికి తానే నిప్పుపెట్టి.. మంటలను చూస్తూ రిలాక్సైన మహిళ.. ఎందుకంటే..

Viral Video: తన ఇంటికి తానే నిప్పుపెట్టి.. మంటలను చూస్తూ రిలాక్సైన మహిళ.. ఎందుకంటే..

ఇంటికి నిప్పుపెట్టి..కుర్చీలో కూర్చొని చూస్తున్న మహిళ

ఇంటికి నిప్పుపెట్టి..కుర్చీలో కూర్చొని చూస్తున్న మహిళ

ఓ మహిళ త‌న ఇంటికి తానే నిప్పంటించుకుంది. ఆ తరువాత ఇంటి ముందు ఉన్న లాన్‌లో కూర్చీ వేసుకొని, పుస్త‌కం ప‌ట్టుకు కూర్చొని మ‌రీ త‌గ‌ల‌బ‌డిపోతున్న ఇంటిని హాయిగా తిలకించింది.

ఇల్లు కాలి ఒక‌డు ఏడుస్తుంటే, చుట్ట కాల్చుకోవ‌డానికి నిప్ప‌డిగాడంట మరొకడు. ఈ సామెత అంద‌రికీ తెలిసిందే. కానీ అంతకంటే విచిత్ర‌మైన ప‌నిచేసింది ఒక మహిళ. అమెరికాలోని మేరీలాండ్‌లో, సిసిల్ కౌంటీ ప్రాంతానికి చెందిన మ‌హిళ.. త‌న ఇంటికి తానే నిప్పంటించుకుంది. ఆ తరువాత ఇంటి ముందు ఉన్న లాన్‌లో కూర్చీ వేసుకొని, పుస్త‌కం ప‌ట్టుకు కూర్చొని మ‌రీ త‌గ‌ల‌బ‌డిపోతున్న ఇంటిని హాయిగా తిలకించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైర‌ల్ అవుతోంది. అయితే సదరు మహిళ ఎందుకలా చేసిందనే వివరాలు మాత్రం తెలియలేదు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటికి నిప్పు అంటించిన విషయాన్ని ఇరుగు పొరుగు వారు గుర్తించి, పోలీసులకు ఫోన్ చేశారు. పక్కింట్లో ఉన్న అవెరి హ్యామోండ్ ఈ వీడియోను రికార్డ్ చేశారు. ముందుగా ఇంటి వాకిలి ముందు ఆ మ‌హిళ ఒక వ్య‌క్తితో గొడ‌వ ప‌డ‌టం ద‌గ్గ‌ర నుంచి వీడియో చిత్రీక‌రించాడు హ్యామోండ్‌. ఆ త‌ర్వాత ఇల్లు కాలిపోవడం, ఆమె ఇంటి ముందు కుర్చీలో హాయిగా కూర్చుని, త‌గ‌ల‌బ‌డుతున్న ఇంటిని చూస్తున్న దృశ్యాలు, ఫైర్ సిబ్బంది ప్ర‌య‌త్నం వంటి విష‌యాల‌తో ఎడిట్ చేసిన ఈ వీడియో ఇంట‌ర్నెట్లో కామెడీతో పాటు, భ‌యంగొల్పేదిగా ఉంది.

' isDesktop="true" id="865756" youtubeid="fs60VMb8cm0" category="international">

ఈ మ‌హిళ త‌న ఇంటిలో అక్క‌డక్క‌డ కొన్ని చోట్లలో నిప్పు పెట్టింద‌ని వీడియో బట్టి తెలుస్తోంది. ఆ కాలిపోతున్న ఇంట్లో మ‌రో వ్య‌క్తి కూడా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఆ ఇంటి పునాదుల ద‌గ్గ‌రున్న కిటికీల నుంచి లోప‌లున్న వ్య‌క్తి స‌హాయం కోసం కేకలు వేయగా, స్థానికులు అతడిని ర‌క్షించారు. ఈ ఘటన ఏప్రిల్ 29న జరిగింది. ఆరోజు మ‌ధ్యాహ్నం 1.15 గంట‌ల‌కు అగ్నిమాప‌క శాఖ‌కు ఫోన్ వ‌చ్చిన‌ట్లు మేరీలాండ్‌ స్టేట్ ఫైర్ మార్ష‌ల్ చెప్పారు. ఫైర్ మార్ష‌ల్ కార్యాల‌యం ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం, కాలిపోయిన ఇంట్లో నలుగురు వ్య‌క్తులు నివ‌సిస్తున్నారు. సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ఇద్ద‌రు ఇంట్లో లేరని తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది.

ఇంటికి నిప్పుపెట్టుకున్న ఆ మ‌హిళ 47 ఏళ్ల గైల్ మెట్‌వ్యాలీగా తెలిసింది. ఆ త‌ర్వాత ఆమె సంఘ‌ట‌నా స్థ‌లం నుంచి వెళ్లిపోయింది. కొంత సేప‌టికి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని, మేరీల్యాండ్ పోలీస్ నార్త్ ఈస్ట్ బెరాక్‌కు తీసుకువెళ్లారు. మెట్‌వ్యాలీపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోద‌య్యింది. దీంతో పాటు ఇంటిని కాల్చేయ‌డానికి సంబంధించిన ఇంకొన్ని చార్జ్‌ల‌ను ఎదుర్కుంటోంది. ఇందులో ఫ‌స్ట్, సెకండ్- డిగ్రీ హ‌త్యాయ‌త్నం, మొద‌టి-డిగ్రీ గృహ ద‌హ‌నం, మొద‌టి-డిగ్రీ దాడి, ద్వేష‌పూరిత ద‌హ‌నం, ద్వేష పూరితంగా ఆస్తిని నాశ‌నం చేయ‌డం, అపాయంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వంటి వివిధ కేసులు పెట్టారు.

First published:

Tags: America, Crime news, Fire Accident, Us news

ఉత్తమ కథలు