ప్రియుడిపై పెట్రోల్‌పోసి తగులబెట్టిన ప్రియురాలు..విజయవాడలో దారుణం

ఖలీల్ పక్కన పడుకున్న సోదరి హజున్నీని..అతడి భార్యగా భావించి ఆమెనూ తగులబెట్టింది. తీవ్ర గాయాలతో హుజున్నీ చనిపోయింది. ఖలీల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

news18-telugu
Updated: June 19, 2019, 5:19 PM IST
ప్రియుడిపై పెట్రోల్‌పోసి తగులబెట్టిన ప్రియురాలు..విజయవాడలో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విజయవాడ నడిబొడ్డున దారుణం జరిగింది. తనను పట్టించుకోవడం లేదన్న కోపంతో ప్రియుడు, అతడి సోదరిపై ఓ మహిళ పెట్రోల్‌పోసి తగులబెట్టింది. సనత్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనలో..అతడి సోదరి అక్కడికక్కడే చనిపోయింది. తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...ఖలీల్ తన భార్య, సోదరితో కలిసి సనత్‌‌నగర్‌లో నివసిస్తున్నాడు. అన్న భార్య ముంతాజ్‌తో అతడికి వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఐతే మూడు నెలల క్రితం ఖలీల్‌కు వివాహం జరగడంతో ముంతాజ్‌ని దూరంపెట్టాడు.

ఖలీల్, అతడి భార్యపై కక్ష పెంచుకున్న ముంతాజ్.. వారిని ఎలాగైనా చంపాలని కుట్రచేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం పెట్రోల్ బాటిల్‌తో ఖలీల్ ఇంటికి చేరుకుంది. మంచంపై నిద్రిస్తున్న ఖలీల్, అతడి సోదరిపై పెట్రోల్‌పోసి నిప్పటించింది. ఖలీల్ పక్కన పడుకున్న సోదరి హజున్నీని..అతడి భార్యగా భావించి ఆమెనూ తగులబెట్టింది. తీవ్ర గాయాలతో హుజున్నీ చనిపోయింది. ఖలీల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: June 19, 2019, 4:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading