భర్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆమెకే అమ్మేసిన భార్య..

నిజానికి రమ్యతో ఆమె భర్త చాలాకాలంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. కొన్నాళ్ల నుంచి ఇంటికి వెళ్లడం కూడా మానేసిన భర్త.. రమ్యతోనే ఉంటున్నాడు.

news18-telugu
Updated: October 18, 2019, 12:51 PM IST
భర్త వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆమెకే అమ్మేసిన భార్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అప్పుడెప్పుడో తెలుగులో వచ్చిన 'శుభలగ్నం' సినిమాలో హీరోయిన్ ఆమని, తన భర్త జగపతిబాబును డబ్బు కోసం రోజాకు అమ్మేస్తుంది. అచ్చు ఇదే సినిమా తరహాలో కర్ణాటకలో ఓ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని మాండ్య జిల్లాకి చెందిన ఓ వివాహిత తన భర్తను రమ్య అనే యువతికి రూ.5లక్షలకు విక్రయించింది. నిజానికి రమ్యతో ఆమె భర్త చాలాకాలంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు.
కొన్నాళ్ల నుంచి ఇంటికి వెళ్లడం కూడా మానేసిన భర్త.. రమ్యతోనే ఉంటున్నాడు. ఇటీవల తన భర్త రమ్యతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమె రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

అయితే అతను తనకు రూ.5లక్షలు బాకీ ఉన్నాడని.. అది చెల్లించకపోవడంతో తన వద్దే పెట్టుకున్నానని రమ్య తెలిపింది. ఇక మాటలు అనవసరం అనుకున్న రమ్య.. తన భర్తను శాశ్వతంగా నీకే వదిలేస్తానని.. అందుకు ఎంత ఇస్తావో చెప్పాలంటూ బేరానికి దిగింది. చివరకు రూ.5లక్షలకు గాను ఇద్దరి మధ్య బేరం కుదిరింది.ఈ నేపథ్యంలో వచ్చే నెల 17న రమ్య ఆమెకు డబ్బు చెల్లించనుంది. ఆ సమయంలో భర్తతో పాటు అతను కట్టిన తాళిబొట్టు కూడా తిరిగి ఇచ్చేయాలని షరతు విధించింది. అందుకు ఆమె ఒప్పుకోవడంతో రమ్య సంతోషంలో మునిగిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>