చదువు చెప్పే ఉపాధ్యాయుల బుద్ధి ఒక్కోసారి పక్కదారి పడుతుంది. తాము పవిత్రమైన వృత్తితో ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోతుంటారు. తమ ప్రవర్తన కారణంగా టీచర్లందరూ ఇబ్బంది పడే చర్యలకు పాల్పడుతుంటారు. తాజాగా తమిళనాడులోని ఓ మహిళా టీచర్ ఇలాంటి చర్యకు పాల్పడి ఉపాధ్యాయ వృత్తికి కళంకం తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. తురైయూర్ సమీపంలోని కొట్టయ్యూరు వెళ్లే రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి 5వ తేదీ పాఠశాల ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత ఆడుకుంటానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఇంటికి తిరిగి రాలేదు. చాలా చోట్ల వెతికినా అతడు కనిపించలేదు. సాధారణంగా అతడు ఎక్కడికి వెళ్లినా చెప్పి వెళతాడని.. అలాంటిది ఇప్పుడు అతడు ఎక్కడికి వెళ్లాడనే విషయం అతడి స్నేహితులకు కూడా తెలియకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఈ నెల 11వ తేదీన తురైయూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అదే పాఠశాలలో ఎంఏ, బీఈడీ, ఎంఫిల్ పూర్తి చేసిన చిక్కతంపూర్‌కు చెందిన వైయాపురి తిలగావతి దంపతుల కుమార్తె షర్మిల కూడా ఆ రోజు నుంచే కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. ఈ కోవలోనే పోలీసులు విచారణ చేపట్టారు.
షర్మిల ఈ పాఠశాలలో 6 సంవత్సరాలుగా టీచర్‌గా పని చేస్తోంది. విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నప్పుడే షర్మిల అతనికి పాఠం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు టీచర్ సెల్‌ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను ట్రేస్ చేసి వేలంకన్ని, తిరువారూర్, తంజావూరు, తిరుచ్చి ప్రాంతాల్లో ఆమె సంచరిస్తున్నట్టు తెలసుకున్నారు. తిరుచ్చి ఎడమలపట్టి పుత్తూరులోని స్నేహితురాలి ఇంట్లో టీచర్ ఉంటున్నట్లు గుర్తించారు. వెంటనే తురైయూర్ సబ్‌ఇన్‌స్పెక్టర్ కళైచెల్వన్ నేతృత్వంలో పోలీసులు అక్కడికి వెళ్లి మహిళా టీచర్ షర్మిల, అతడితో పాటు ఉన్న మైనర్ స్టూడెంట్‌ను ప్రశ్నించారు.
ఇష్టపడి ఒక్కటయ్యారు.. బాగానే కాపురం చేసుకుంటున్నారు.. కానీ వీళ్లు మామూలోళ్లు కాదని తేల్చిన పోలీసులు
కుక్కతో పాటు దాని పిల్లనూ ఉరేసి చంపేశారు.. అసలు మనుషులేనా? మూగజీవాలపై ఇంత క్రూరత్వామా?
తంజావూరు దేవాలయంలో వీరికి పెళ్లి జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో తురైయూర్ పోలీసులు విద్యార్థిని, మహిళా టీచర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. దీనిపై ముజిరి ఆల్ మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ కావేరి టీచర్‌ను విచారించారు. 17 ఏళ్ల విద్యార్థిని తురైయూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినందుకు షర్మిల అనే టీచర్‌ను పోక్చో చట్టం కింద అరెస్టు చేశారు. విద్యార్థిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Private teachers