ఇన్సూరెన్స్ డబ్బుల కోసం యువతి కక్కుర్తి... రూ. 3.14 కోట్ల కోసం చేతిని నరుక్కుని...

ప్రమాద భీమా పాలసీ క్లెయిమ్ చేసుకునేందుకు తన చేతిని తానే నరుక్కున్న యువతి... అనుమానం వచ్చి, ప్రైవేట్ డిటెక్టివ్ ద్వారా రహస్య దర్యాప్తు చేయించిన ఇన్యూరెన్స్ కంపెనీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 13, 2019, 9:06 PM IST
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం యువతి కక్కుర్తి... రూ. 3.14 కోట్ల కోసం చేతిని నరుక్కుని...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 13, 2019, 9:06 PM IST
జీవిత భీమా డబ్బుల కోసం బ్రతికున్న భర్త చనిపోయాడని చెప్పిన వాళ్లనూ చూసి ఉంటాం... ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంతవాళ్లనే చంపిన వాళ్లనూ చూసి ఉంటాం... కానీ ఇది మాత్రం వాటన్నింటికి మించిన విచిత్రమైన సంఘటన. భీమా డబ్బుల కోసం తన చేతినే నరుక్కుందో మహిళ. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన స్లోవేనియా దేశంలో వెలుగుచూసింది. స్లోవేనియా రాజధాని నగరం జుబుల్‌జానాలో నివాసం ఉంటున్న ఓ 21 ఏళ్ల మహిళ... ప్రమాద భీమా పాలసీ తీసుకుంది. ఈ పాలసీ ప్రకారం ఏదైనా ప్రమాదంలో గాయపడినట్లయితే సదరు పాలసీదారుడికీ నెలవారీ ఖర్చుల నిమిత్తం 3 వేల పౌండ్లతో (రూ.2.75 లక్షలకు పైగా) పాటు ప్రమాదం జరిగిన తర్వాత నాలుగు లక్షల పౌండ్లు (దాదాపు మూడు కోట్ల 14 లక్షల రూపాయలు) పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ డబ్బుకోసం ఆశపడిన సదరు మహిళ... కుటుంబసభ్యులతో కలిసి పథకం పన్నింది. తన చేతికి గాయమైందంటూ ఆసుపత్రిలో చేరింది. ఇంట్లో తోటపని చేస్తుండగా ప్రమాదవశాత్తు తన చేతికి గాయమైందంటూ వైద్యులకు తెలిపారు. అయితే ఆమె గాయానికి, వాళ్లు చెబుతున్నదానికీ పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ యాజమాన్యం... ప్రైవేట్ డిటెక్టివ్ ద్వారా రహస్య దర్యాప్తు చేయించారు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాద భీమా ద్వారా వచ్చే డబ్బుల కోసం యువతి, తన చేతిని తానే నరుక్కుందని తేలింది. భీమా కంపెనీని మోసం చేసేందుకు ప్రయత్నించిన సదరు యువతితో పాటు ఆమెకు సహకరించిన నలుగురు కుటుంబసభ్యులపై ఛీటింగ్ కేసు నమోదుచేసింది ఇన్సూరెన్స్ కంపెనీ.First published: March 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...