హోమ్ /వార్తలు /క్రైమ్ /

Pune: ఆటోలో ఆమె పక్కన కూర్చోగానే ప్యాంట్‌లో చేయి పెట్టుకుని.. ఆ 40 ఏళ్ల మహిళ ఆ యువకుడిని అలా చూసి ఏం చేసిందంటే..

Pune: ఆటోలో ఆమె పక్కన కూర్చోగానే ప్యాంట్‌లో చేయి పెట్టుకుని.. ఆ 40 ఏళ్ల మహిళ ఆ యువకుడిని అలా చూసి ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ 40 ఏళ్ల మహిళ తన కొడుకుకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. షేర్ ఆటో కావడంతో అప్పటికే ఆ ఆటోలో ఓ 30 ఏళ్ల వయసున్న యువకుడు కూర్చుని ఉన్నాడు. కొడుకు అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆ మహిళ తొందరగా ఆసుపత్రికి వెళ్లాలనే ఆలోచనతో ఆ ఆటోలోనే కొడుకును వెంటబెట్టుకుని ఎక్కింది. ఆటోలో ఆ మహిళ కూర్చున్న తర్వాత నుంచి...

ఇంకా చదవండి ...

పుణె: సమాజంలో మహిళలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. లోకల్ ట్రైన్స్‌లో, సిటీ బస్సుల్లో, షేర్ ఆటోల్లో ప్రయాణించే సందర్భంలోనో కొందరు ఆకతాయిలు మహిళలపై వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. కొందరు పక్కన ఆడవాళ్లు ఉన్నారనే ఇంగితం కూడా లేకుండా బహిరంగంగా బరితెగిస్తున్నారు. పుణెలో జరిగిన ఈ ఘటన మగాళ్లలో ఉన్న కొందరు కామాంధుల నీచ మనస్తత్వానికి నిదర్శనంగా నిలిచింది. పుణె జిల్లా పింప్రి చించ్‌వాడ్ ప్రాంతంలో ఓ 40 ఏళ్ల మహిళ తన కొడుకుకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. షేర్ ఆటో కావడంతో అప్పటికే ఆ ఆటోలో ఓ 30 ఏళ్ల వయసున్న యువకుడు కూర్చుని ఉన్నాడు. కొడుకు అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆ మహిళ తొందరగా ఆసుపత్రికి వెళ్లాలనే ఆలోచనతో ఆ ఆటోలోనే కొడుకును వెంటబెట్టుకుని ఎక్కింది. ఆటోలో ఆ మహిళ కూర్చున్న తర్వాత నుంచి ఆ యువకుడి ప్రవర్తన మారిపోయింది. ఆమెను అదే పనిగా చూస్తూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఆటో బ్రేక్ వేసినప్పుడల్లా కావాలని మీద పడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగలేదు. ఆటో కొద్ది దూరం వెళ్లాక ఆ యువకుడు నీచమైన పని చేశాడు. ఆ మహిళను చూస్తూ ప్యాంట్ జిప్ తీసి హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. దీంతో.. యువకుడి ప్రవర్తనతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్‌‌కు గురైంది. ఆ మహిళ అతనిని పట్టించుకోకుండా ఆటో యశ్వంతవ్ చవాన్ మెమోరియల్ హాస్పిటల్ వద్దకు వెళ్లే వరకూ మౌనంగా ఉంది. ఆటో ఆసుపత్రి వద్దకు చేరుకోగానే.. ఆసుపత్రి సమీపంలో విధుల్లో ఉన్న పోలీసులకు బాధితురాలు జరిగిన విషయం చెప్పింది. పోలీసులు ఆ యువకుడికి బుద్ధి చెప్పి అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిని సోహెబ్ ఖురేషీగా గుర్తించారు. పోలీసులు ఆటో వైపు వస్తుండటాన్ని గమనించిన సోహెబ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు.

అయితే.. స్థానికులు అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సరిగ్గా కొద్దిరోజుల క్రితం.. ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఎంఎంజీ జిల్లా ఆసుపత్రిలో మెడిసిన్స్ కోసం ఓ 40 ఏళ్ల మహిళ క్యూలో నిల్చుని ఉంది. ఆమె వెనుకనే ఉన్న 35 ఏళ్ల వ్యక్తి ఆమెను తాకుతూ హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఆ వ్యక్తి చేస్తున్న దుశ్చర్యను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూడా ఈ తరహా ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఓ 24 ఏళ్ల వయసున్న వ్యక్తి స్కూటీపై వెళుతున్నాడు. ఓ 21 సంవత్సరాల వయసున్న యువతి అడ్రస్ కోసం అతనిని అడగ్గా.. అడ్రస్ చెబుతున్నట్టే చెప్పి కొద్దిసేపటికి ఆమెకు తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ ఆ వ్యక్తి నీచంగా ప్రవర్తించాడు. ఆమె చేయి పట్టుకుని మరో చేతితో హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు.

పోలీసులు యువతి ఫిర్యాదుతో చిరాగ్ భాటి అనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎందుకిలా చేశావని ఆ వ్యక్తిని అడగ్గా అతను చెప్పిన సమాధానం విని విస్తుపోవడం పోలీసుల వంతైంది. తన భార్య గర్భిణి కావడంతో గత మూడు నెలలుగా శృంగారం చేయడానికి వీలు పడలేదని, అందుకే ఇలా చేసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. సంస్కారంసభ్యత మరిచి మహిళలతో కొందరు మగాళ్లు ఇలా ప్రవర్తిస్తున్న ఘటనలు మహిళల భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

First published:

Tags: Crime news, Pune, Pune news

ఉత్తమ కథలు