WOMAN READY FOR NINTH MARRIAGE POLICE ARRESTED DOCTORS REVEALED THAT SHE HAS HIV POSITIVE VB
తొమ్మిదో పెళ్లికి సిద్ధపడిన మహిళ.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్యులు ఆమెకు ఆ వ్యాధి ఉందంటూ వెల్లడి.. దీంతో మాజీ భర్తలు..
ప్రతీకాత్మక చిత్రం
Crime News: యువకులు.. విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న వాళ్లను ఆమె టార్గెట్ చేస్తుంది. ఇలా వాళ్లకు మాయమాటలు చెప్పి ఎనిమిది మందిని పెళ్లి చేసుకుంది. తొమ్మిదో వ్యక్తిని కూడా వివాహం చేసుకుంటున్న సమయంలో పోలీసులు వచ్చి వివాహాన్ని రద్దు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు ఎయిడ్స్ వచ్చిందంటూ వెల్లడించారు. దీంతో మాజీ భర్తలు షాక్ అయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పెళ్లి కావాల్సిన యువకులు.. పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న వారి కోసం ఆమె సోషల్ మీడియా ద్వారా వెతుకుతుంది. సింగిల్ గా ఉన్న అబ్బాలను టార్గెట్ చేస్తుంది. ఇలా వాళ్లను తన మాటలతో ఆకట్టుకుంటుంది. యువకులను అయితే.. ప్రేమిస్తున్నా.. పెళ్లి (Marriage) చేసుకోవాలనుకుంటున్నా అంటూ వారి వెంట పడుతుంది. విడాకులు(Divorce) తీసుకొని ఒంటరిగా ఉంటున్న వాళ్లను.. ఎన్నాళ్లిలా ఒంటరి జీవితాన్ని గడుపుతావు.. తనను జీవిత భాగస్వామిగా చేసుకో అంటూ.. గారడీ మాటలు చెబుతుంది. ఇలా ఆమె చెప్పిన మాటలకు.. ఓ ఎనిమిది మంది అమాయకులు బలైపోయారు. ఇక తొమ్మిదో వ్యక్తి బైపోతుండగా.. ఆమె ఆగడాలను అనూహ్యంగా బ్రేక్ పడింది. అసలేం జరిగింది.. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
హర్యానా(Haryana)లోని కైతాల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి కూడా అయింది. కొన్ని రోజుల వరకు దంపతులు బాగానే ఉన్నా.. ఓ రోజు ఆమె భర్త ఇంటి నుంచి వెళ్లి.. ఎంతసేపటికి తిరిగి ఇంటికి రాలేదు. ఆమెకు వివాహం జరిగి నాలుగు సంవత్సరాల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. బంధువులు, స్నేహితుల వద్ద వెతికింది. కానీ అతడి ఆచూకీ మాత్రం
ఎక్కడా లభించలేదు. ముగ్గురు పిల్లలతో ఆమె ఎలా బతకాలో అర్థం కాకుండా ఉంది. ఏం చేయాలో తోచక దిక్కుతోచని పరిస్థితిలో ఉంది ఆ మహిళ. ఆ క్రమంలోనే ఆమెకు ఓ చెడు ఆలోచన వచ్చింది. అప్పడి నుంచి మోసాలు చేయడం ప్రారంభించింది. ఆమెకు తన తల్లి కూడా సహకారం అందించింది. పంజాబ్, హర్యానాలలో బ్రహ్మచారులు, విడాకులు తీసుకున్న లేదా భార్య చనిపోయిన భర్తలను ట్రాప్ చేయడం మొదలుపెట్టింది.
పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తిని ట్రాప్ చేసి రహస్యంగా ఏ గుడిలోనో పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు ముఖ్యంగా..పెళ్లి అయి విడాకులు తీసుకున్న వాళ్లు, సింగిల్ గా ఉన్న అబ్బాయిలను మాత్రమే టార్గెట్ చేసేది. ఆమె ప్లాన్ అమలు చేసిందంటే.. పక్కాగా జరిగిపోయేది. ఇలా పెళ్లి చేసుకొని పట్టుమని పది రోజులు కూడా కాకుండానే ఏదో ఒక కారణంతో గొడవలు పెట్టుకునేది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగేది. దాంతో తనకు విడాకులు(Divorce) కావాలంటూ గొడవ పెట్టుకొని.. విడాకులతో పాటు భారీ మొత్తంగా భరణం చెల్లించుకుని అక్కడ నుంచి వెళ్లిపోయేది.
ఇలా ఒక నెల రోజులు ఆగి మళ్లీ.. మరో యువకుడికి వల వేసేది. ఇలా ఆమె ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుంది. ఇక తొమ్మిదో పెళ్లి చేసుకోబోతుంటే.. పోలీసులు వచ్చి ట్విస్ట్ ఇచ్చారు. ఆమె వివాహం చేసుకున్న వారిలో ముగ్గురు యువకులు.. ఇటీవలే ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె గురించి ఆరా తీశారు. తర్వాత ఆమె మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు వివరాలను తెలసుకొని వాళ్లు ఆ ప్రదేశానికి వెళ్లి పెళ్లిని రద్దు చేశారు. తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు(Doctors) షాక్ అయ్యారు. ఆమెకు హెచ్ ఐవీ ఎయిడ్స్ పాజిటివ్ గా వచ్చింది. దీంతో మాజీ భర్తలు ఎనిమిది మందికి ఒకటే గుబులు. వాళ్ల టెన్షన్ మామూలుగా లేదు. తమకు కూడా హెచ్ఐవీ ఉందేమోనని.. తెగ ఆలోచనలో పడ్డారు. వాళ్లకు కూడా పోలీసులు పరీక్షలు చేయనున్నటు తెలిసింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.