Marriage twist : అమ్మాయి పెళ్లికి అంతా రెఢి అనుకున్నారు.. ఇంతలో ఆబ్బాయి వాట్సప్‌కి షాకింగ్ ఫోటో.. ఆ తర్వాత ఏం జరిగింది..?

Marriage twist : అమ్మాయి పెళ్లికి అంతా రెఢి అనుకున్నారు..

marriage twist : పెళ్లికి అంతా రెఢి అనుకున్న సమయంలో అబ్బాయికి సడన్‌గా ఓ వాట్సప్ మెస్సెజ్ వచ్చింది. ఆ మెసెజ్ చూసిన అబ్బాయితో పాటు అమ్మాయి కూడా షాక్‌కు గురైంది. ఇంతకి ఏం జరిగిందనే వాకబు చేస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

 • Share this:
  అమ్మాయిలు అబ్బాయిలతో ( Boys and girls ) క్లోజ్‌గా ఉన్నా.. లేదంటే అమ్మాయిలపై అబ్బాయిల కన్నుపడినా జరిగే పరిణామాలు వేరుగా ఉంటున్నాయి.. అన్ని మరిచిపోయి అమ్మాయిలు పెళ్లి పీటలు ఎక్కె సమయానికి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమ మాట వినని అమ్మాయిలను లైంగికంగా వేధించేందుకు కొంత మంది అబ్బాయిలు సిద్దమవుతుండగా మరికొంతమంది మాత్రం సమయం కోసం వేచి చూసి వారిపై వేటు వేస్తున్నారు.

  ఇలాంటి సంఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎప్పుడో యువతికి తెలియకుండానే జరిగిన సంఘటన పెళ్లి సమయంలో పత్యక్షమయంది. అందంగా ముస్తాబై తన జీవితంలో పెళ్లి చేసుకుని స్థిరపడాలని కలలు కన్నా యువతికి చుక్కెదురైంది. ఈ క్రమంలోనే ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అమ్మాయి, అబ్బాయితోపాటు కుటుంబ సభ్యులు ఓకే అనుకున్నారు. అయితే ఇక్కడే ఓ పిడిగులాంటీ వార్త వారికి చేరింది. వివరాల్లోకి వెళితే...

  ఇది చదవండి : హిందూ అమ్మాయిని కన్న కూతురులా చూసుకుని పెళ్లి చేసిన ముస్లిం దంపతులు


  అస్సాం (asom ) రాజధాని దిస్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన కూతురుని ఆయన స్తోమత కొద్దీ చదివించాడు. పెళ్లీడు రావడంతో.. తన కూతురికి తగిన వాడిని వెతికే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయిని చూశాడు. అమ్మాయిని చూసుకోవడానికి ఇంటికి రావాల్సిందిగా కోరాడు. దీంతో తాజాగా ఆ అబ్బాయి సన్నిహితులతో కలిసి.. ఆ యువతి ఇంటికి వెళ్లాడు. అందంగా ముస్తాబై వచ్చి, టీ ( tea) అందించిన ఆమెను చూసి, ఓకే చెప్పేశాడు. యువతికి కూడా అతడు నచ్చడంతో ఇరు కుటంబ సభ్యలు ఇతర విషయాలను మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

  ఇది చదవండి : జగన్ సర్కారుకు మరో షాక్ -మహిళా పోలీసుల నియామకాలపై హైకోర్టు నోటీసులు -జీవో 59 రద్దేనా?


  ఇంతలో ఆ అబ్బాయికి ఓ వాట్సప్ మెసేజ్ (Watsapp) వచ్చింది.అందులో.. తాను పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన అమ్మాయి నగ్నఫొటో ఉండటంతో అతడు ( shok ) షాకయ్యాడు. ఈ విషయం ఆ అమ్మాయి కూడా మొదట ఖంగుతింది. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషన్‌కు ( police staion ) వెళ్లి, తన కజీన్‌పై ఫిర్యాదు చేసింది. తాను చదువుకుంటున్న సమయంలో ఓ రోజు కాలేజీకి వెళ్తుండగా.. తన ద్విచక్ర వాహనం చెడిపోయినట్లు చెప్పింది. ఈ క్రమంలో తన కజీన్ తన ఫ్రెండ్ కారులో తనను కాలేజీ వద్ద డ్రాప్ చేస్తానని చెప్పడంతో అతడిని నమ్మినట్టు చెప్పింది. కారులో ఎక్కిన తర్వాత అతడు తనకు ఓ కిల్‌డ్రింక్ ( cool drinks ) ఇచ్చాడని.. అది తాగిన వెంటనే స్పృహ కోల్పోయినట్టు పేర్కొంది. అనంతరం తన ఫ్రెండ్‌తో కలిసి తనపై అత్యాచారం ( rape ) చేసినట్టు వివరించింది. ఈ సమయంలోనే అతడు తన నగ్న ఫొటోలను తీసుంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
  Published by:yveerash yveerash
  First published: