WOMAN RAPED PUSHED DEATH TENTH FLOOR KANPUR POLICE DETAILS HERE VB
అతడి వద్ద సెక్రటరీగా ఆమె పని చేస్తుంది.. పని ఉందంటూ ప్లాట్ కు రప్పించుకున్నాడు యజమాని.. చివరకు ఇలా జరిగింది..
ప్రతీకాత్మక చిత్రం
Crime News: ఓ యజమాని తన వద్ద పనిచేస్తున్న 19 ఏళ్ల యువతిపై అతడు కన్నేశాడు. రోజూ మాదిరిగా ఆమె పనులకు వెళ్తూ.. పని అయిన తర్వాత ఇంటికి వెళ్లేది. కానీ ఓ రోజు ఇంటి దగ్గర పనులు చేయాలంటూ అతడు తన ప్లాట్ కు రప్పించుకున్నాడు. లైంగికంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆవె దానిని తీవ్రంగా ప్రతిఘటించింది. చివరకు ఏం జరిగిందంటే..
ఓ యజమాని వద్ద సెక్రటరీగా(Secretery) పనిచేస్తున్న 19 ఏళ్ల యువతిపై అతడు కన్నేశాడు. రోజూ మాదిరిగా ఆమె తన విధులు పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్లేది. కానీ ఓ రోజు పని ఉందంటూ అతడు తన ప్లాట్ కు రప్పించుకున్నాడు. లైంగికంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆవె దానిని తీవ్రంగా ప్రతిఘటించింది. డబ్బులు ఇస్తానంటూ కూడా అతడు ఆశచూపాడు. ఆమె ముమ్మాటికి ససెమిరా అన్నాది. దీంతో అతడు కోపోద్రిక్తుడు అయ్యాడు. ఎంతకు తన మాట వినకపోవడంతో.. కామ కోరిక ఎలాగైనా తీర్చుకోవాలని ఘోరానికి పాల్పడ్డాడు. బలవంతంగా నోరు మూసి.. రూంకి తీసుకెళ్లి రేప్(Rape) చేశాడు.
తర్వాత యువతి ఈ విషయాన్ని పోలీసులకు చెబుతా అంటూ అనడంతో అతడు తన ప్లాట్ నుంచి.. అంటే 10 వ అంతస్తు నుంచి కిందకు తోసేసి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో ప్రతీక్ వైశ్ (40) డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద 19 ఏళ్ల యువతి పని చేస్తుంది. ఆమెపై కన్నేసిన ఆ ప్రబుద్దుడు ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. తమ విధులు ముగించుకొని ఇంటి వెళ్లిన ఆ యువతిని.. అధికారిక పనుల నిమిత్తం కల్యాణ్‌పూర్‌లోని తన ఫ్లాట్‌కు రమ్మని ఫోన్ చేసి పిలిచాడు. యజమాని ఫోన్ చేశాడు కదా అని ఆమె వెళ్లింది.
చాలా రోజులుగా యువతిని లొంగతీసుకునేందుకు యత్నిస్తున్న నిందితుడు తన ఇంట్లోకి వచ్చిన యువతిని లొంగ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె దానికి ఒప్పుకోలేదు. డబ్బులు కూడా ఇస్తాను.. తన కోరిక తీర్చు అంటూ ఆమెను అడిగాడు.. ఆమె తనకు ఇలాంటివి ఇష్టం ఉండదు.. నన్ను వదిలేయంటి అంటూ వేడుకుంది. అయినా అతడ వినలేదు.. ఎలాగైనా కామ కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఎంత ఒత్తిడి చేసినా.. ప్రలోభాలకు గురిచేసినా వినకపోవడంతో రేప్ చేశాడు. యువతి ఏడుస్తూ పోలీసులకు చెబుతాననడంతో ప్రతీక్ వైశ్ కిరాతకంగా ప్రవర్తించాడు.
యువతిని తాను నివసిస్తున్న 10వ అంతస్తు నుంచి తోసేశాడు. ప్రమాదం జరిగి చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడని.. కాన్పూర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ బీబీజీటీఎస్ మూర్తి వెల్లడించారు. ఆమెపై అత్యాచారం జరిగిన తర్వాత, ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆ మహిళ బెదిరించిందని.. ఆ తర్వాత నిందితుడు తన పదో అంతస్తు ఫ్లాట్ బాల్కనీ నుండి ఆమెను తోసేశాడని.. ఫలితంగా ఆమె మరణించిందని ఆయన చెప్పారు. మొదట్లో పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. కాని తరువాత అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు డిసిపి తెలిపారు. అతడిని కోర్టు అనుమతితో జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.