మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చెల్లెలిపై ఇద్దరు సోదరుల అఘాయిత్యం...దారుణం...

ఆమెపై అలా 3 నెలల పాటు అత్యాచారానికి ఆ కీచక సోదరులు ఒడిగట్టారు. దీంతో వారి అరాచకాలు భరించలేని ఆమె పోలీసులను ఆశ్రయించి వారిపై కేసు పెట్టింది. ప్రతిగా నిందితులు ఆమెను భౌతికంగా చంపేయాలని ప్రయత్నించారు.

news18-telugu
Updated: June 30, 2020, 10:59 PM IST
మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చెల్లెలిపై ఇద్దరు సోదరుల అఘాయిత్యం...దారుణం...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వావివరసలు మరచి ఇద్దరు సోదరులు తమ సోదరికే మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. మైనర్ బాలిక అనే కనికరం లేకుండా ఆమెపై ఆ కీచకులు అత్యాచారం చేశారు. బీహార్ లోని చంపారన్ జిల్లాలో ఈ కన్నీటి ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు స్థానికంగా వ్యవసాయ పనులు చేసుకొని బతుకుతుంది. అయితే పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన సమయంలో, అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి బాబాయి కుమారులు ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారం చేశాడు. విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెబితే చంపేస్తామని హెచ్చరించారు. అక్కడితో ఆగలేదు...తమకు ఎప్పుడు కోరిక కలిగితే అప్పుడు రావాలని...లేకపోతే చంపేస్తామని బెదరించారు.

దీంతో ఆమెపై అలా 3 నెలల పాటు అత్యాచారానికి ఆ కీచక సోదరులు ఒడిగట్టారు.  దీంతో వారి అరాచకాలు భరించలేని ఆమె పోలీసులను ఆశ్రయించి వారిపై కేసు పెట్టింది. ప్రతిగా నిందితులు ఆమెను భౌతికంగా చంపేయాలని ప్రయత్నించారు. దీంతో బాధితురాలు తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పోలీసులకు ఆశ్రయించి... తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది.
First published: June 30, 2020, 10:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading