స్పెషల్ క్లాస్ చెబుతానని..గదిలోకి రమ్మని యువతిపై ట్యూటర్ అత్యాచారం...

యువతిని జ్యూస్ తాగమని ఇవ్వగా, అందులో మత్తు మందు కలిపి ఉండటంతో ఆమె తాగగానే స్పృహ కోల్పోయింది. ఇదే అదనుగా భావించిన సునీల్ బాధితురాలిపై లైంగికదాడికి దిగాడు. అంతేకాదు వీడియో సైతం తీశాడు.

news18-telugu
Updated: December 16, 2019, 5:47 PM IST
స్పెషల్ క్లాస్ చెబుతానని..గదిలోకి రమ్మని యువతిపై ట్యూటర్ అత్యాచారం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చదువు చెప్పాల్సిన గురువు క్రూర మృగంలా మారిపోయాడు. తన విద్యార్థిని పైనే అత్యంత కిరాతకానికి ఒడిగట్టి సభ్య సమాజం తల దించుకునేలా చేశాడు. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్ లోని అమెర్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు సోనం(పేరుమార్పు) స్థానిక కోచింగ్ సెంటర్లో విద్యార్థినిగా తరచూ క్లాసులకు వస్తోంది. ఈ నేపథ్యంలో కోచింగ్ సెంటర్లో నిర్వాహకుల్లో ఒకరైన నిందితుడు సునీల్ (పేరు మార్పు) బాధితురాలు సోనంపై కన్నేశాడు. తరచూ ఆమెకు స్పెషల్ క్లాసులు చెప్పాలని తనను ఏకాంతంగా కలవమని ఆదేశించేవాడు. దీంతో ఆమె ప్రైవేటుగా కలిసేందుకు సునీల్ గదిలోకి వెళ్లింది. అనంతరం యువతిని జ్యూస్ తాగమని ఇవ్వగా, అందులో మత్తు మందు కలిపి ఉండటంతో ఆమె తాగగానే స్పృహ కోల్పోయింది. ఇదే అదనుగా భావించిన సునీల్ బాధితురాలిపై లైంగికదాడికి దిగాడు. అంతేకాదు వీడియో సైతం తీశాడు.

అనంతరం ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయం బయట చెబితే వీడియోలు బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. అయితే తరచూ యువతిపై నిందితుడు సునీల్ అత్యాచారానికి ఒడిగట్టడంతో, ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

First published: December 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>