మహిళపై ముగ్గురు వ్యక్తుల రేప్... ట్రక్కులో ఎత్తుకెళ్లి...

వివాహిత అని కూడా చూడకుండా ముగ్గురు వ్యక్తులు ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

news18-telugu
Updated: October 7, 2019, 7:11 PM IST
మహిళపై ముగ్గురు వ్యక్తుల రేప్... ట్రక్కులో ఎత్తుకెళ్లి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 7, 2019, 7:11 PM IST
భర్త, కూతురుతో కలిసి బయట భోజనం చేద్దామని వెళిన ఓ మహిళను కామాంధులు కబళించారు. వివాహిత అని కూడా చూడకుండా ఎత్తుకెళ్లి తమ కామవాంఛ తీర్చుకున్నారు. తనను వదిలేయాలని ఆ మహిళ ఎంతగా వేడుకున్నా... అదంతా అరణ్యరోదనగానే మిగిలిపోయింది. కామంతో రగిలిపోయిన మానవ మృగాల నుంచి పారిపోలేకపోయిన ఆ మహిళ... కొన్ని గంటల పాటు వారి చేతిలో నరకయాతర అనుభవించింది. హర్యానాలోని ముర్తాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త, కూతురితో కలిసి ముర్తాల్‌లోని ఓ దాబాలో భోజనం చేసేందుకు వెళ్లిన ఓ మహిళ... ఆ తరువాత కుటుంబంతో కలిసి బైక్‌పై ఇంటికి తిరుగు ప్రయాణమైంది. అయితే మధ్యలో బైక్‌ ఆగిపోవడంతో... కొద్దిసేపు నడుచుకుంటూ వెళ్లింది.

అయితే ఇంతలోనే పక్కనే హఠాత్తుగా ట్రక్కు ఆపిన కొందరు... ఆమెను ట్రక్కు ఎక్కించుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. బల్లాబ్‌గర్‌ వైపు వెళ్లిన ట్రక్కులోని ముగ్గురు వ్యక్తులు... కొద్ది దూరం వెళ్లిన తరువాత ట్రక్కు ఆపి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకరి తరువాత ఒకరు ఆమెపై దాడి చేసి తమ కామవాంఛ తీర్చుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ట్రక్కులో పరారయ్యారు. అయితే ట్రక్కు నెంబర్ గుర్తు పెట్టుకున్న మహిళ... భర్తతో కలిసి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు... నిందితులను గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు.


First published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...