మహిళకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో ఎక్కించుకొని...నిర్మానుష్య ప్రదేశంలో..దారుణం...

కారును స్పీడుగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమె పై అత్యాచారానికి దిగారు. దీంతో ఆ మహిళ భయంతో వణికి పోయింది. అనంతరం ఆ మహిళను రోడ్డుపై వదిలేసి, బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు.

news18-telugu
Updated: August 2, 2020, 10:06 PM IST
మహిళకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో ఎక్కించుకొని...నిర్మానుష్య ప్రదేశంలో..దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహిళలకు భద్రత కరువైంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చిన మార్పు రావడం లేదు. ఆడది కనిపిస్తే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా బీహార్ లోని చాప్రాలో దారుణం జరిగింది. బాధితురాలు దివ్య ( పేరు మార్చాం) తన పుట్టింటి నుంచి అత్తగారింటికి బయలు దేరింది. లాక్ డౌన్ కారణంగా బస్సులు దొరక్క పోవడంతో బస్టాండ్ లో ఆటో కోసం ఎదురు చూడసాగింది. అంతలోనే స్థానికంగా ఉంటూ లల్లూ కారు నడుపుకుంటూ వచ్చి దివ్య ముందు ఆపాడు. లిఫ్ట్ ఇస్తాను కారు ఎక్కమన్నాడు. లల్లూ తమ కుటుంబానికి తెలిసిన వాడే అయినప్పటికీ, దివ్య కారు ఎక్కేందుకు తటపటాయించింది. కానీ వర్షం పడటం మొదలు కావడంతో దిక్కులేక అతడి కారు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరేనని కారు ఎక్కేసింది. కాస్త దూరం వెళ్లాక, లల్లూ ఒక వ్యక్తిని దారిలో దింపుతానని కారులో ఎక్కించుకున్నాడు. మరికాస్త దూరం వెళ్లాక మరో వ్యక్తి బలవంతంగా వెనుక సీటులో దివ్య పక్కన కూర్చున్నాడు. అపాయం అని గుర్తించిన దివ్య గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. దీంతో లల్లూ అతడి ఇద్దరు స్నేహితులు దివ్య నోట్లో గుడ్డలు కుక్కారు.

కారును స్పీడుగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమె పై అత్యాచారానికి దిగారు. దీంతో ఆ మహిళ భయంతో వణికి పోయింది. అనంతరం ఆ మహిళను రోడ్డుపై వదిలేసి, బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. దివ్య తనకు జరిగిన ఘటనతో కుమిలిపోయింది. కాగా అటుగా వెళుతున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం దివ్య ఒంటరిగా ఉందని గమనించి కారు ఆపగా, పోలీసులకు దివ్య అసలు సంగతి చెప్పింది. నిందితులను వెంబడించి అరెస్టు చేయగా, దివ్య వారిపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
Published by: Krishna Adithya
First published: August 2, 2020, 10:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading