ముసలోడు కాదు కామపిశాచి....వయాగ్రా వేసుకొని..కూతురు లాంటి అమ్మాయి.. కాళ్లు చేతులు కట్టేసి..

ప్రతీకాత్మక చిత్రం

70 సంవత్సరాల వయస్సు ఓ వృధ్ధుడు ప్రతిరోజు వయాగ్రా వేసుకొని మహిళ కాళ్లు చేతులు కట్టేసి ప్రతి రోజు అత్యాచారం చేసిన ఘటన ఖతార్ లో చోటుచేసుకుంది.

 • Share this:
  గల్ఫ్ బాధితుల గోడు అంతా ఇంతా కాదు కాసుల కోసం, అవసరాల కోసం దూర తీరాలకు వెళ్లిన అభాగ్యుల వెతలు తలచుకుంటేనే ఒళ్లుగగుర్పాటు కలుగుతుంది. తాజాగా ఓ మహిళ తనకు జరిగిన ఘోర అనుభవాన్ని యూట్యూబ్ లో పంచుకుంది. 70 సంవత్సరాల వయస్సు ఓ వృధ్ధుడు ప్రతిరోజు వయాగ్రా వేసుకొని మహిళ కాళ్లు చేతులు కట్టేసి ప్రతి రోజు అత్యాచారం చేసిన ఘటన ఖతార్ లో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా కంభంకు చెందిన సుజాత (పేరు మార్చాం) ఆమె తన భర్తతో కలిసి గుంటూరు వెళ్లి కూలీ నాలి చేసుకుంటూ బతికేవారు. అయితే సుజాత భర్త అనారోగ్యం పాలవడంతో కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఇద్దరు కూతుళ్లు, అనారోగ్యం బారిన పడిన భర్తతో కలిసి ఎలా జీవితం సాగించాలా అని బాధ పడింది. ఇంతలో తమ బంధువుల్లో కొందరు గల్ఫ్ వెళ్లి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడం గమనించింది. దీంతో ఎలాగైనా తాను కూడా గల్ఫ్ వెళ్లి తన కష్టాల నుంచి బయటపడాలనకుంది. ఈ క్రమంలో ఓ ఏజెంట్ ద్వారా ఆమె గల్ఫ్ వెళ్లాలనుకుంది. సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని, చెప్పడంతో ఆమె అప్పు ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు కూడబెట్టుకొని, చివరకు కోటి ఆశలతో ఖతార్ లో అడుగుపెట్టింది. మొదట ఓ ఇంట్లో పని కుదిరింది. అక్కడ అంతా సజావుగానే గడిచింది. కాస్త డబ్బు కూడా వెనకేసుకునే చాన్స్ దక్కింది. అంతా బాగుంది అనుకుంటున్న క్షణంలో ఆమె పని చేస్తున్న యజమాని అమెరికా వెళ్లిపోవడంతో ఆమె మరోసారి పని కోసం వెతుకులాటలో పడింది.

  ఈ సారి ఏజెన్సీ ఓ ఇంట్లో పనిమనిషిగా చేసుకోమని కాంట్రాక్టు ఇచ్చింది. కాంట్రాక్టు కింద 6 నెలల పాటు పనిచేయాల్సి ఉంది. ఓ అరబ్ షేక్ ఇంట్లో పని కుదిరింది. వెళ్లిన తొలి వారమే...ఆమెకు ఓ షాక్ తగిలింది. సదరు అరబ్ షేక్ పెద్ద స్త్రీలోలుడు అని తేలింది. అతడి కోరిక తీర్చకపోతే చిత్ర హింసలు పెడతాడని తెలిసింది. దీంతో సుజాత వణికిపోయింది. అనుకున్నట్టుగానే సరిగ్గా వారం గడిచిన తర్వాత ఒక రోజు అరబ్ షేక్ తనతో సెక్స్ చేయమని ఆదేశించాడు. వినకపోయే సరికి కొరడాతో ఆమెను బాది ఆమెపై తొలిసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో రోజు ఉదయం ఆ అరబ్ షేక్ గది శుభ్రం చేస్తుండగా, ఆ కిరాతకుడు ఆమెను అత్యాచారం చేశాడు.

  సుజాత మాట వినకపోతేఆమెను ఓ గదిలో బంధించి చిత్ర హింసలకు గురి చేసేవాడు. అరబ్ షేక్ తన స్నేహితులతో కలిసి రోజుల పాటు అత్యాచారం చేసేవాడు. అటు కాంట్రాక్టును వదులుకొని పారిపోతే తిరిగి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆమె పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారు అయ్యింది. అలాగే చిత్ర హింసల నడుమ కాంట్రాక్టు గడువు ముగిసింది. ఇక బతుకు జీవుడా అని ఆమె స్వదేశం చేరుకుంది. తాను పడ్డ కష్టం పగవాడు కూడా పడకూడదని చెప్పుకొచ్చింది.
  Published by:Krishna Adithya
  First published: