ఉద్యోగం ఎరవేసి యువతిపై మూడు నెలల పాటు లైంగిక దాడి...చివరకు ఏం జరిగిందంటే..?

ప్రతిరోజు తన కార్యాలయానికి వచ్చి వెళ్లాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు ప్రతిరోజు కార్యాలయానికి వచ్చి ఉద్యోగం గురించి వాకబు చేస్తూ వచ్చింది. కాగా ఒక రోజు యువతికి ఫ్రూట్ జ్యూస్ లో మత్తుమందు ఇచ్చి నిందితుడు ఆమెపై లైంగిక దాడికి దిగాడు. మెలుకువ వచ్చిన తర్వాత చూస్తే యువతి తనపై జరిగిన అఘాయిత్యం తెలుసుకొని షాక్ కు గురైంది.

news18-telugu
Updated: October 17, 2019, 2:04 PM IST
ఉద్యోగం ఎరవేసి యువతిపై మూడు నెలల పాటు లైంగిక దాడి...చివరకు ఏం జరిగిందంటే..?
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి యువతిపై వరుసగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పల్లు ప్రాంతానికి చెందిన పోలీస్ స్టేషన్ పరిధిలో రాజస్థాన్ కు చెందిన యువతిని ఉద్యోగం పేరిట నిందితుడు గత మూడు నెలలుగా లైంగిక దాడి జరుపుతున్నాడని తేలింది. రాజస్థాన్ హనుమాన్ ఘడ్ జిల్లాకు చెందిన 22 సంవత్సరాలు బాధితురాలు, బీఈడీ పూర్తిచేసి ఉద్యోగ వేటలో భాగంగా ఇండోర్ చేరింది. ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటన చూసి యువతి నిందితుడి కార్యాలయానికి చేరింది. తనకు కేంద్రప్రభుత్వానికి చెందిన సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకోసం ప్రతిరోజు తన కార్యాలయానికి వచ్చి వెళ్లాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు ప్రతిరోజు కార్యాలయానికి వచ్చి ఉద్యోగం గురించి వాకబు చేస్తూ వచ్చింది. కాగా ఒక రోజు యువతికి ఫ్రూట్ జ్యూస్ లో మత్తుమందు ఇచ్చి నిందితుడు ఆమెపై లైంగిక దాడికి దిగాడు. మెలుకువ వచ్చిన తర్వాత చూస్తే యువతి తనపై జరిగిన అఘాయిత్యం తెలుసుకొని షాక్ కు గురైంది.

అయితే నిందితుడు మాత్రం బయట ఎవరికి చెప్పవద్దని, కేంద్రప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మబలికాడు. అలా మూడు నెలల పాటు యువతిపై లైంగికదాడి చేస్తూ, తన పశువాంఛ తీర్చుకున్నాడు. కానీ యువతికి మాత్రం ఉద్యోగం దక్కలేదు. గత వారం బాధిత యువతి, నిందితుడిని నిలదీయగా అతడు మొహం చాటేశాడు. దీంతో యువతి చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

థాయ్ ల్యాండ్ భామ అందాలు చూస్తే మతిపోతుంది...

First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading