టీచర్ ను ఇంటికి రమ్మని ఆహ్వానించి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి...దారుణం...

తాను చెప్పినట్లు వినాలని లేదంటే.. అత్యాచారం చేసిన సమయంలో తీసిన వీడియోలు బయటపెడతానని బెదిరించాడు.

news18-telugu
Updated: May 22, 2020, 8:23 PM IST
టీచర్ ను ఇంటికి రమ్మని ఆహ్వానించి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి...దారుణం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఓ స్కూల్‌లో టీచర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డాన్న ఆరోపణలపై ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన బీహార్ లోని నలంద జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన టీచర్‌ దారి తప్పాడు.. తనతో పని చేస్తున్న టీచర్‌పై కన్నేశాడు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా పని చేస్తూ.. తోటి టీచర్‌తో తన కామవాంఛలు తీర్చుకోవాలని పరితపించాడు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా రాంగోపాల్(పేరుమార్పు) పని చేస్తున్నాడు. ఇతనికి కొన్ని సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. ఈ క్రమంలో స్కూల్‌లో పని చేస్తున్న టీచర్‌తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. మాయ మాటలతో నమ్మించి లొంగదీసుకున్నాడు. ప్రిన్సిపాల్‌ మాటలు నమ్మిన ఆ టీచర్‌.. అతడు చెప్పినట్లు చేసింది. గతవారం టీచర్‌ను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఇంటికి వెళ్లగానే ఆమెకు కూల్‌ డ్రింక్‌లో మత్త మందు కలిపి తాగించాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న టీచర్‌.. అతడిని నిలదీసింది. అయితే తాను చెప్పినట్లు వినాలని లేదంటే.. అత్యాచారం చేసిన సమయంలో తీసిన వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. ఈ నేపథ్యంలోనే తనను నమ్మించి మోసం చేసి ప్రిన్సిపాల్‌ అత్యాచారం చేశాడని టీచర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading