భర్తను చెట్టుకు కట్టేసి కళ్ల ఎదుటే భార్యను దారుణంగా అత్యాచారం చేసి...షాకింగ్...

కొంత మంది భార్యపై అఘాయిత్యానికి పాల్పడటం గమనించాడు. వెంటనే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతన్ని చెట్టుకు కట్టేసి నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు తెలిపారు.

news18-telugu
Updated: August 2, 2020, 11:04 PM IST
భర్తను చెట్టుకు కట్టేసి కళ్ల ఎదుటే భార్యను దారుణంగా అత్యాచారం చేసి...షాకింగ్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా..వారి అగడాలు మరింత పెరిగిపోయాయి. తాజాగా భర్త ఎదుటే భార్యపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. తర్వాత వారి వద్ద ఉన్నడబ్బులను సైతం దోచుకెళ్లారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కాన్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్‌ తెలిపిన వివరాల ప్రకారం...బైక్‌పై వెళ్తున్న దంపతులు.. కాలకృత్యం తీర్చుకునేందుకు భార్య బైక్ దిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది.

భార్య ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త.. అటవీ ప్రాంతంలోకి వెళ్లి చూడగా, అక్కడ కొంత మంది భార్యపై అఘాయిత్యానికి పాల్పడటం గమనించాడు. వెంటనే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతన్ని చెట్టుకు కట్టేసి నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు తెలిపారు. అంతేకాదు వారి వద్ద నుంచి డబ్బుతో పాటు స్మార్ట్ ఫోన్ సైతం దోచుకొని ఉడాయించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా, వారి ఫిర్యాదు మేరకు డిప్యూటీ ఇన్స్‌ పెక్టర్‌ ఆధ్వర్యంలో పోలీసు బృందం సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించింది. నిందితులపై త్వరలోనే పట్టుకుంటామని, వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అనుమానితులును ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Published by: Krishna Adithya
First published: August 2, 2020, 11:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading