హర్యానాలోని గురుగ్రామ్‌లో జరుగుతున్న నేరాలకు లెక్కలేదు. ఢిల్లీకి దగ్గర్లోనే ఉన్న ఈ ప్రాంతంలో... మోసగాళ్లు ఎక్కువైపోతున్నారు. తాజాగా గురుగ్రాం పోలీసులు 29 ఏళ్ల ఓ కేడీ కోసం వెతుకుతున్నారు. తనతో ఒకప్పుడు కలిసి పనిచేసిన 24 ఏళ్ల మహిళా ఉద్యోగినిని అతను రేప్ చేశాడు. ఐతే, అతను అత్యంత తెలివైన వాడు. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుంటున్నాడు. చిక్కినట్టే చిక్కి పారిపోయిన అతని కోసం వేట మొదలైంది. బాధితురాలు కనిష్క (పేరు మార్చాం)కు 2014లో తొలిసారి అతడు పరిచయమయ్యాడు. మంచివాడిలా నటిస్తూ... కనిష్క అక్కకు 2018లో జాబ్ ఇప్పించాడు. దాంతో అతనిపై ఆమె సదభిప్రాయం కలిగివుంది. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న అతను అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
తాజాగా కనిష్కను కలిసేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. సరిగ్గా ఆమె భర్త ఇంట్లో లేని టైం చూసి, ఆమె ఒక్కత్తే ఉన్న టైం చూసి వచ్చాడు. ఏంటిలా వచ్చారు అని అడిగితే... మీ కోసం ఓ జాబ్ ఉంది. అది మీకు బాగా సెట్టవుతుంది అన్నాడు. అవునా థాంక్యూ... కూర్చోండి అంది ఆమె. ఆమె వైపే చూస్తూ... అమాయకుడిలా నటిస్తూ హాల్‌లోని సోఫాలో కూర్చున్నాడు. టీ తాగుతారా, కాఫీ తాగుతారా అని అడిగిన ఆమె... టీ తెద్దామని కిచెన్ లోకి వెళ్లింది. ఆమె స్టవ్ పై టీ పెడుతుంటే... ఇంతలో ఇంటి మెయిన్ డోర్ మూసేశాడు. ఆ తర్వాత ఆమెను బలవంతపెట్టి రేప్ చేశాడు. ఒకప్పుడు తనతో కొలీగ్‌లా ఉన్న వ్యక్తి, ఇప్పుడు తనతో ఇలా ప్రవర్తిస్తుంటే... ఏం చెయ్యాలో, ఎలా తప్పించుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. తన ఇంట్లోనే తాను బంధీ అయిపోయింది. తన ఇంట్లోనే తనకు రక్షణ లేకుండా పోయినట్లైంది. ఆమె అవసరాన్ని, తన అవకాశంగా మార్చుకున్న ఆ దుర్మార్గుడు ఎంత వద్దన్నా వినకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచీ పారిపోయాడు.
దారుణం జరిగిన సాయంత్రం తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది బాధితురాలు. ప్రస్తుతం అతడు మానెసర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు... మర్నాడు అక్కడికి వెళ్లారు. ఐతే... ఎలా తెలుసుకున్నాడో గానీ... పోలీసులు తన కోసం వస్తున్నారని తెలిసి... ఆఫీస్‌కి వచ్చేందుకు రూం నుంచీ బయలుదేరినవాడు కాస్తా రాకుండా మానేశాడు. పోలీసులు అతని రూంకి వెళ్లగా... తాళం వేసి ఉంది. మూడ్రోజులుగా రూంకి రావట్లేదు. అతని కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
లెక్కలేనన్ని కష్టాలు... తీరని అప్పులు... రోడ్డెక్కిన జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులు...
అల్లకల్లోలమైన భువనేశ్వర్ రైల్వే స్టేషన్... ఇప్పట్లో కోలుకోవడం కష్టమే...
కేబినెట్ కూర్పుపై జగన్ దృష్టి... తూర్పు గోదావరి జిల్లా నేతకు అత్యంత కీలక మంత్రి పదవి ?
ఏపీలో రాజకీయ సంక్షోభం... టార్గెట్ చంద్రబాబు ? రాష్ట్రపతి పాలన తెస్తారా ?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.