WOMAN RAPED AT GUNPOINT BY FRIEND PUNJAB ZIRAKPUR DETAILS HERE VB
Sad: ఎంత నమ్మించావ్ రా అయ్యా.. స్నేహితురాలిపై ఇలా చేయడానికి మనస్సు ఎలా ఒప్పుకుంది.. పాపం ఆమె నడిరోడ్డుపై
ప్రతీకాత్మక చిత్రం
So Sad: పంజాబ్‌లోని మొహాలి జిల్లాలోని జిరాక్‌పూర్‌లో తన హాస్టల్ వద్ద దింపుతానని కారులో లిప్ట్ ఎక్కించుకున్నాడు ఆమె స్నేహితుడు. ఇలా ఆ 22 ఏళ్ల మహిళపై స్నేహితుడు తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి. తాజాగా జరిగిన ఓ ఘటనలో తెలిసిన వాడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో మహిళల రక్షణకు ఏ మాత్రం భద్రతలేకుండా పోతోంది.
బస్టాండ్ వద్ద దింపుతానని తన స్నేహితుడు కారులో ఎక్కించుకొని నిర్మాణుణ్య ప్రాంతానికి తీసుకెళ్లి.. తుపాకీతో బెదిరించి అత్యాంత దారుణంగా అత్యాచారం చేశాడు. ఈ ఘటనల పంజాబ్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు వివరాలు ఇలా తెలిపారు. 22 ఏళ్ల బాధిత యువతి బర్నాలలోని తన ఇంటి నుంచి మొహాలీకి బస్సులో చేరుకుంది. అక్కడ అప్పటికే రాత్రి అయిపోయింది. ఒంటరిగా ఆమె భయపడుతూ ఉంది. ఆమె వద్ద ఎక్కువగా లగేజీ ఉండటంతో బస్టాండ్‌కు వచ్చి తనను పికప్ చేసుకోవాలని స్నేహితుడు కుష్విందర్ సింగ్‌కు ఫోన్ చేసింది.
అతడు తన ఎస్యూవీ కారులో వచ్చి ఆమెను రాత్రి 8 గంటల సమయంలో బస్టాప్ నుంచి ఎక్కించుకున్నాడు. పంజాబ్‌లోని మొహాలి జిల్లాలోని జిరాక్‌పూర్‌లో తన హాస్టల్ వద్ద దింపుతానని కారులో ఆమెను ఎక్కించుకున్నాడు. కానీ అతడు వక్ర బుద్ది చూపించి కారును వేరే రూట్ కు మళ్లించాడు. అప్పటికే ఆమె ఎక్కడకు తీసుకెళ్తున్నావ్ అంటూ అడిగింది.. తనకు అతడు తెలిసిన వాడే కదా అని ఎక్కువగా భయపడకుండా.. షార్ట్ కట్ రూట్ లో తీసుకెళ్తాను అనగానే నమ్మేసింది. ఓ నిర్మాణుష్య ప్రదేశంలో ఆపి.. తన దగ్గర ఉన్న తుపాకీ తీసి ఆమెను బెదిరించాడు. తన కామ కోరిక తీర్చాలని లేదంటే.. ఇక్కడే చంపేస్తానని బెదిరించాడు.
అయినా ఆమె ప్రతి ఘటించడంతో బలవంతంగా రోడ్డుపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడ నుంచి ఆమెను తీసుకెళ్లకుండా అక్కడే రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమె క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ నుంచి తను ఉండే పీజీ వసతి గృహానికి చేరుకుంది. మరుసటి రోజు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుష్వీందర్ భటిండాకు చెందినవాడని ఆమె పేర్కొన్నారు.
అతడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376 (అత్యాచారం), 365 (ఒక వ్యక్తిని రహస్యంగా మరియు తప్పుగా నిర్బంధించాలనే ఉద్దేశ్యంతో కిడ్నాప్ చేయడం లేదా అపహరించడం), మరియు 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేయబడింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని.. త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.