హోమ్ /వార్తలు /క్రైమ్ /

డ్రైనేజీలో నగ్నంగా మహిళ మృతదేహం.. ఆమె జననాంగాలపై తీవ్ర గాయాలు.. ఏం జరిగింది?

డ్రైనేజీలో నగ్నంగా మహిళ మృతదేహం.. ఆమె జననాంగాలపై తీవ్ర గాయాలు.. ఏం జరిగింది?

ముంబైలో ధనవంతులు ఎక్కుగా నివసించే బాంద్రా ప్రాంతంలో ఓ డ్రైనేజీలో మహిళ శవాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. గొంతుకోసి ఆమెను చంపేశారు. జననాంగాలపై తీవ్రంగా దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.

    మన దేశంలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. కఠిన శిక్షలు పడుతున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముంబైలో దారుణం జరిగింది. డ్రైనేజీలో ఓ మహిళ మృతదేహం లభ్యమయింది. ఒంటిపై దుస్తులు లేవు. జననాంగాల వద్ద గాయాలు కనిపించాయి. ఆమెను రేప్ చేసి.. గొంతుకోసి.. చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ఎంతో బిజీగా ఉండే ఎంటీఎన్ఎల్ జంక్షన్ సమీపంలో మహిళ డెడ్ బాడీ లభ్యమవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలో ధనవంతులు ఎక్కుగా నివసించే బాంద్రా ప్రాంతంలో ఓ డ్రైనేజీలో మహిళ శవాన్ని స్థానికులు గుర్తించారు. వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

    మృతురాలి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. గొంతుకోసి ఆమెను చంపేశారు. జననాంగాలపై తీవ్రంగా దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెక‌్షన్‌ 376, 302 కింద కేసు నమోదు చేశారు. హత్యకు గురయిన మహిళ వేశ్యగా ప్రాథమికంగా భావిస్తున్నారు. నగదకు సంబంధించి గొడవ జరిగి ఉండవచ్చని.. ఈ క్రమంలోనే ఆమె వద్దకు వెళ్లిన విటులు, చంపేసి ఉండవచ్చని ప్రాథమికంగా తెలిపారు. నిందితులు దొరికిన తర్వాత ఈ హత్య కేసుపై పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని.. బాంద్రా ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మృతురాలి వయసు 30 ఏళ్ల వరకు ఉంటుందని.. పోస్టుమార్టం కోసం ఆమె డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

    First published:

    Tags: Crime news, Mumbai, Murder, Telugu news

    ఉత్తమ కథలు