వద్దు బావా తప్పు అన్నా వినకుండా...మరదలిపై పైశాచికత్వం...భార్య సహకారంతోనే...

మంగీలాల్ కు మరదలు పూనంపై కన్ను పడింది. తన కోరికను భార్య ఎదుటే బయటపెట్టాడు. అయితే కుసుమ్ కూడా అందుకు సరే అన్నది. తన సోదరితో భర్త కామ వాంఛ తీర్చేందుకు సిద్ధపడింది.

news18-telugu
Updated: March 26, 2020, 3:36 PM IST
వద్దు బావా తప్పు అన్నా వినకుండా...మరదలిపై పైశాచికత్వం...భార్య సహకారంతోనే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తోడబుట్టిన సోదరిని కట్టుకున్న భర్త లైంగిక వాంఛలు తీర్చడం కోసం వాడి ఆమె జీవితాన్ని నాశనం చేసిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. బేగూసరాయ్ జిల్లాలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళితే పూనం( పేరు మార్పు) తన సోదరి ఇంట్లో ఆశ్రయం పొందుతోంది. చదువుకోవడానికి గ్రామం నుంచి వచ్చి అక్క ఇంట్లోకి చేరింది. అయితే అక్క కుసుమ్ ( పేరు మార్పు) తన భర్త మంగీలాల్ ( పేరు మార్పు) తో కలిసి జీవిస్తోంది. కుసుమ్ తన సోదరి పూనంతో మొదట్లో బాగానే ఉంది. అంతేకాదు తన కూతురులా చూసుకుంది. మంగీలాల్ సైతం తన మరదల్ని బాగా చూసుకున్నాడు. ఇలా వారి కుటుంబంలో ఒక సభ్యురాలిగా పూనం కలిసిపోయింది. ఈ క్రమంలో మంగీలాల్ కు మరదలు పూనంపై కన్ను పడింది. తన కోరికను భార్య ఎదుటే బయటపెట్టాడు. అయితే కుసుమ్ కూడా అందుకు సరే అన్నది. తన సోదరితో భర్త కామ వాంఛ తీర్చేందుకు సిద్ధపడింది. ఇందుకోసం పూనం తాగే పాలల్లో మత్తుమందు కలిపింది. మంగీలాల్ తన పశువాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత పూనం మెలుకువ వచ్చిన తర్వాత కుసుమ్ ఆ విషయాన్ని స్వయంగా చెప్పింది. బావ కోరిక తీర్చాలని, అలాగే తమకు సంతానం లేదని నీ ద్వారా ఓ బిడ్డను కూడా కంటామని పూనంకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. ఇదంతా విన్న పూనం షాక్ కు గురైంది. కూతురు లా చూసుకుంటానని మాట ఇచ్చిన అక్క తన శీలంతో ఇలా ఆడుకుంటుందని కలలో కూడా అనుకోలేదు. ఈ ఘటనతో షాక్ తిన్న పూనం వెంటనే పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఉంది.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు