news18-telugu
Updated: September 9, 2020, 7:40 AM IST
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. చట్టాలంటే లెక్కచేయకుండా.. శిక్షలంటే భయం లేకుండా.. దారుణాలకు ఒడిగడుతున్నారు కామాంధులు. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. గుర్తు తెలియని మహిళను దుండుగులు అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పబ్లిక్ టాయిలెట్లో పడేసి పరారయ్యారు. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే వంతనె పక్కన ఉన్న మూత్రశాలలో మంగళవారం ఉదయం ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహంపై దుస్తులు లేవు. దుప్పటి మాత్రమే కప్పి ఉంది. ఆమె వయసు 35 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమెపై 2 రోజుల క్రితం మరో ప్రాంతంలో అత్యాచారం చేసి చంపేసి... తర్వాత మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో ఇటీవల నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను ఆరా తీస్తున్నారు. రాష్ట్రపతి రోడ్డులోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
September 9, 2020, 7:40 AM IST