Home /News /crime /

WOMAN PUSHED OFF TERRACE BY IN LAWS IN DELHI PVN

OMG : దారుణం..మహిళను బిల్డింగ్ పై నుంచి తోసేసిన అత్తింటివాళ్లు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Woman Pushed Off Terrace : బిల్డింగ్‌ టెర్రస్‌ పై నుంచి కింద రోడ్డుపై పడిపోయిన మహిళ(Woman)ను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను దగ్గర్లోని మాక్స్ హాస్పిటల్ కి తరలించారు. ఆ మహిళకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

ఇంకా చదవండి ...
Woman Pushed Off Terrace : దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో దారుణం జరిగింది. ఢిల్లీలోని మయూర్ విహార్‌(Mayur Vihar)లో 30 ఏళ్ల మహిళను... అత్తింటివారు బిల్డింగ్ టెర్రస్‌(Building Terrace)పై నుంచి తోసేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 3.00 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. బిల్డింగ్‌ టెర్రస్‌ పై నుంచి కింద రోడ్డుపై పడిపోయిన మహిళ(Woman)ను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను దగ్గర్లోని మాక్స్ హాస్పిటల్ కి తరలించారు. ఆ మహిళకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం... బాధితురాలు రచనకు 3 సంవత్సరాల క్రితం మయూర్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రిలోక్‌పురి నివాసి పునీత్ ఉంట్వాల్‌తో వివాహం జరిగింది.

తన సోదరిని అత్తింటి వారు బిల్డింగ్‌ టెర్రస్‌ నుంచి కిందకు తోసివేశారని బాధితురాలు రచన సోదరుడు ఆరోపించాడు. తన సోదరిని ఆమె బావ, ఆయన భార్య బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఢిల్లీ మహిళా కమిషన్‌కు కూడా ఈ వీడియోను పంపాడు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసినట్లు ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌ తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం, మెడికో లీగల్ కేసు (MLC) మరియు ఈ వ్యవహారంపై ఇప్పటివరకు జరిపిన విచారణల ఆధారంగా పోలీసులు సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద బాధిత మహిళ అత్తింటివారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు జిల్లా) ప్రియాంక కశ్యప్ తెలిపారు. విచారణ ప్రస్తుతం జరుగుతోందని ఆమె తెలిపారు.

See Pics : కూతురు పెళ్లికి చనిపోయిన తండ్రి..కన్నీళ్లు పెట్టించే సంఘటన

Kailash Vijayvargiya : బీజేపీ ఆఫీస్ సెక్యూరిటీ గార్డులుగా అగ్నివీర్​లకే ప్రాధాన్యం..బీజేపీ కీలక నేత వ్యాఖ్యలపై విపక్షాలు పైర్

మరోవైపు,ఒడిశాలో (Odisha) ఒక రాజకీయ నాయకుడు, సోమాలిక దాస్ అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. అమ్మాయిని మోసం చేసుకుంటానని చెప్పి, ఆమెను శారీరకంగా లొంగ దీసుకున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపింది. ఒడిశాలోని తిర్డోక్ ఎమ్మెల్యే బిజయ్ శంకర్ దాస్ కాలేజ్ రోజుల నుంచి ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు. తరచుగా కలుసుకునే వారు. ఈ క్రమంలో యువతి.. అబ్బాయి దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో అతను కొద్ది రోజులుగా ముఖం చాటేశాడు. దీంతో యువతి.. పెద్దల దగ్గరు తన పంచాయతీని తీసుకెళ్లింది. తనతో ఉన్నఫోటోలను చూపించింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని తెలిపింది. ఈ క్రమంలో పెద్దలు, అమ్మాయిని పెళ్లిచేసుకొవాలని తీర్మానించారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అబ్బాయి తొలుత రిజిస్ట్రర్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనికి అమ్మాయి తరపు వారు.. ఏర్పాటు చేశారు. అబ్బాయి కోసం ఎదురు చూడసాగారు. కానీ వరుడు టైమ్ కి పెళ్లికి రాలేదు. ఎంత సేపటికి ఫోన్ తీయలేదు. దీంతో సోమాలిక దాస్ మరోసారి మోసపోయానని (cheating) గ్రహించి బాధితురాలు పోలీసులకు (Odisha Fiancée lodges FIR) ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.అయతే, ఎమ్మెల్యే వాదన మరో విధంగా ఉంది.. తన నియోజక వర్గంలో అనేక పనులు ఉన్నాయని, తన తల్లికి ఆరోగ్యం బాగాలేక పోవడం వలన రాలేక పోయాయని అన్నారు. రిజిస్ట్రర్ ఆఫీస్ లో పెళ్లికి నమోదు చేసుకున్నాక.. 90 రోజులలోపు ఎప్పుడైన పెళ్లి చేసుకొవచ్చని అన్నారు. తనకు ఇంకా 60 రోజులు సమయం ఉందన్నారు. ఇది మోసం చేసినట్లు ఎలా అవుతుందని అధికారులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు కూడా తలలు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Crime news, Delhi

తదుపరి వార్తలు