Home /News /crime /

WOMAN PRIVATE PARTS STITCHED BY HUSBAND OVER SUSPICION IN MADHYA PRADESH SU

Shocking: అతడి వయసు 64, ఆమె వయసు 55.. ఏ భర్త చేయకూడని విధంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అతడి వయసు 64, ఆమె వయసు 55. వారిద్దరు భార్యభర్తలు. అయితే ఈ వయసులో కూడా అతనిలో పైశాచికత్వం బుసలు కొట్టింది.

    అతడి వయసు 64, ఆమె వయసు 55. వారిద్దరు భార్యభర్తలు. అయితే ఈ వయసులో కూడా అతనిలో పైశాచికత్వం బుసలు కొట్టింది. భార్యపై అనుమానంతో ఏ భర్త చేయకూడని విధంగా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. చివరకు ఆమె ప్రైవేట్ పార్ట్స్‌కు కుట్లు వేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని సింగ్రౌలి జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. మహిళ ఓ పోలీసు అధికారిని సంప్రదించి.. ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సింగ్రౌలి జిల్లాలో(Singrauli district) ఓ గ్రామంలో నివసిస్తున్న ఓ వ్యక్తికి.. తన భార్యతో తరుచూ గొడవపడేవాడు. ఆమెకు గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించేవాడు. ఆమెను తీవ్రంగా హింసించేవాడు. ఈ క్రమంలోనే ఓ రోజు ఆమె ప్రైవేట్ పార్ట్స్‌కు సూది, దారంతో కుట్లు వేశాడు.

    అయితే ఇందుకు సంబంధించి మహిళ ఓ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వడంతో.. ఆమె భర్త నీచమైన పని వెలుగుచూసింది. దీంతో పోలీసులు తర్వాత పోలీసులు మహిళను ప్రభుత్వ ఆధీనంలోని వైద్య కేంద్రానికి తరలించారు. మహిళకు ప్రైవేటు పార్ట్స్‌లో వేసిన కుట్లను అక్కడి వైద్య సిబ్బంది తొలగించారు. ప్రస్తుతం ఆమె వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారు.

    ఆమె చేసేది పోలీసు ఉద్యోగం.. ఆ ఒక్క పనితో అడ్డంగా బుక్కయ్యారు.. ఇప్పుడు ఇలా..

    ‘నిందితుడు మహిళ ప్రైవేటు భాగాల్లో కుట్లు వేసేందుకు సూది, దారాన్ని ఉపయోగించాడు. మేము వాటిని స్వాధీనం చేసుకున్నాం’ అని ఓ పోలీసు అధికారి చెప్పినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇక, నిందితుడిపై శారీరక, మానసిన వేధింపులతో పాటు సంబంధిత సెక్షన్ల కేసు నమోదు చేశారు.మరోవైపు మహిళ అంతటి బాధను అనుభవించినప్పటికీ.. తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆమె పోలీసులను కోరినట్టుగా ఓ పోలీసు అధికారి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు అయిందని.. ప్రస్తుతం అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు చెప్పారు.

    భర్త సమక్షంలోనే దారుణం జరిగింది.. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికే ఇలా.. మహిళ సంచలన ఆరోపణలు..

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు ఉన్న మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఇటీవలికాలంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, దాడులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. నిత్యం ఏదో ఒక చోట మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు సంబంధించిన వార్తలు వింటూనే. ఈ నేరాలకు పాల్పడుతున్నవారు బాధితులకు తెలిసినవారే కావడం చాలా ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు భర్త, అత్తింటి నుంచి వరకట్న వేధిపులు, గృహ హింస ఎదుర్కొనే మహిళల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగించే విధంగా ఉంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Madhya pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు