చంచల్ గూడ జైలులో రిమాండ్లో ఉన్న మహిళా ఖైదీ ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టు అయిన జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడారు. ఇటీవలే ఈఎస్ఐ కుంభకోణంలో ఎసిబి అధికారులకు పట్టుబడిన పద్మ మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమె నిద్రమాత్రలు ఓవర్ డోస్ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తలించారు. పద్మను ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇటీవలే జాయింట్ డైరెక్టర్ పద్మ ఈఎస్ఐ స్కాంలో ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.