WOMAN POLICE CONSTABLE DIES BY SUICIDE IN PIMPRI CHINCHWAD MAHARASHTRA SSR
మహిళా కానిస్టేబుల్ భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో పెరిగిన చనువు.. కానీ ఊహించని విధంగా..
ప్రతీకాత్మక చిత్రం (credit - twitter)
మహారాష్ట్రలోని పింప్రీ చించ్వాడ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ 47 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పింప్రీ చించ్వాడ్ ప్రాంతానికి చెందిన ఓ 47 ఏళ్ల మహిళ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఓ పీడబ్ల్యూడీ ఇంజనీర్‌తో ఆమె చనువుగా ఉండేది. అయితే.. సరిగ్గా రెండు వారాల క్రితం...
పుణె: మహారాష్ట్రలోని పింప్రీ చించ్వాడ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ 47 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పింప్రీ చించ్వాడ్ ప్రాంతానికి చెందిన ఓ 47 ఏళ్ల మహిళ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఓ పీడబ్ల్యూడీ ఇంజనీర్‌తో ఆమె చనువుగా ఉండేది. అయితే.. సరిగ్గా రెండు వారాల క్రితం ఆ వ్యక్తి తనను మోసం చేశాడని వోర్లీ పోలీస్ స్టేషన్లో మహిళ రేప్ కేసు పెట్టింది. తనపై పలుసార్లు ఆ ఇంజనీర్ అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
అయితే.. మరో విషయమేంటంటే.. భర్త చనిపోయిన ఈ మహిళా కానిస్టేబుల్ పుణె రూరల్ పీఎస్‌లో విధులు నిర్వర్తించేంది. తోడు కావాలని భావించిన ఆమె ఓ విడో మ్యారేజ్ బ్యూరోను సంప్రదించింది. అక్కడే అజయ్(53) అనే పీడబ్ల్యూడీ ఇంజనీర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. తన భార్యకు విడాకులు ఇచ్చినట్టుగా ఆమెకు పరిచయం చేసుకున్న అజయ్ చాలా చనువుగా మెలిగాడు. అయితే.. జనవరి 14న ఆమె ఇచ్చిన ఫిర్యాదులో.. సెప్టెంబర్ 2019 నుంచి డిసెంబర్ 22 వరకూ తనపై వోర్లీలోని ఇంట్లో, పన్వేల్‌లోని రెండు ప్రదేశాల్లో అజయ్ అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొంది.
అజయ్ విడాకుల పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉందని ఆమె తెలిపింది. అప్పటి నుంచి.. తీవ్ర మనోవేదన చెందిన మహిళ పవన నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త కూడా ఓ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆమె మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని, ఆమె కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉందని, ఆ ఒత్తిడిలోనే ఈ నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.