Married Woman: సీఎంకు ఫేస్‌బుక్‌లో ‘Please Help Me, Sir’ అని పోస్ట్ పెట్టి వివాహిత ఆత్మహత్య..

రోలీ గుప్తా (ఫైల్ ఫొటో)

ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో ‘దయచేసి నాకు సాయం చేయండి, సార్’ అని పోస్ట్ పెట్టి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. యూపీలోని హర్దోయ్ జిల్లా మాధవ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రోలీ గుప్తా(34), మనోజ్ గుప్తా భార్యాభర్తలు.

  • Share this:
    హర్దోయ్: ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో ‘దయచేసి నాకు సాయం చేయండి, సార్’ అని పోస్ట్ పెట్టి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. యూపీలోని హర్దోయ్ జిల్లా మాధవ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రోలీ గుప్తా(34), మనోజ్ గుప్తా భార్యాభర్తలు. మొహల్లా ఆజాద్‌నగర్‌లో నివసిస్తున్నారు. సెప్టెంబర్ 4న రాత్రి 7 గంటల సమయంలో రోలీ గుప్తా ఇంటికి లవి త్రివేది అనే వ్యక్తి, అతని కుటుంబం వెళ్లింది. ఆ సమయంలో రోలీ భర్త మనోజ్ ఇంట్లో లేడు. ఆ సమయంలో రోలీ ఇంటికెళ్లిన లవి త్రివేది ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించేసరికి రోలీని బెల్ట్‌తో కొట్టి.. ఆమె ముక్కు కొరికి మృగంలా ప్రవర్తించాడు. ముక్కు వెంట రక్తం కారుతున్న స్థితిలో ఉన్న రోలీని లవీ త్రివేది తండ్రి పుతి త్రివేది కర్రలతో రోలీని విచక్షణారహితంగా కొట్టాడు. లవీ తల్లి మీరా దేవి కూడా రోలీపై దాడి చేసింది. అంతేకాదు.. రోలీ మెడలోని లాకెట్‌ను, చెవి దుద్దులను, ఇంట్లో ఉన్న రెండు స్మార్ట్‌ఫోన్లను, రూ.90 వేల డబ్బును లవీ త్రివేది కుటుంబం తీసుకెళ్లిపోయింది.

    తమకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపేస్తామని లవీ త్రివేది రోలీని హెచ్చరించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రోలీ స్పృహ తప్పి పడిపోయింది. కొంతసేపటికి రోలీ భర్త ఇంటికొచ్చాడు. గాయాల పాలైన భార్యను చూసి ఏమైందని అడిగాడు. రోలీ జరిగిందంతా చెప్పింది. భార్యను వెంటబెట్టుకుని మనోజ్ మాధవ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తమ ఇంట్లోకి చొరబడి తన భార్యపై అత్యాచారానికి యత్నించి, ఇంట్లో ఉన్న డబ్బు, తన భార్య నగలను దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. ఆ ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అత్యాచారానికి, హత్యకు యత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రోలీ ఆత్మహత్యకు ముందు ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌లో పేర్కొంది.

    ఇది కూడా చదవండి: Affair: భార్య చనిపోయింది.. మేనల్లుడి భార్యతో యవ్వారం నడిచింది.. చివరకు ఇద్దరికీ ఈ చెట్టే మిగిలింది..

    తన కుటుంబానికి ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె తెలిపింది. ‘దయచేసి నాకు సాయం చేయండి, సీఎం సార్’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లో రోలీ కోరింది. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే సెప్టెంబర్ 5న ఆదివారం రోలీ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. విచారణ పూర్తయి రిపోర్ట్ రాగానే.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన లవీ త్రివేదిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: