• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • WOMAN OFFERED DATING OFFER AND SERVANT PHONE CALL AND BLACKMAILED CYBER CRIME AK GH

డేటింగ్ ఆఫర్ ఇచ్చిన మహిళ.. పని మనిషి ఫోన్.. చివరకు ఏమైందంటే..

డేటింగ్ ఆఫర్ ఇచ్చిన మహిళ.. పని మనిషి ఫోన్.. చివరకు ఏమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

కాల్ స్వీకరించిన మహిళ ప్రీతి అని పరిచయం చేసుకుంది. అతడి నుంచి కొన్ని వివరాలను స్వీకరించింది. అనంతరం డేటింగ్ రిజిస్ట్రేషన్ కోసం కొంత డబ్బు చెల్లించాలని చెప్పింది.

  • Share this:
    సైబర్ నేరస్థులు కొత్త రకం మోసాలను ఎంచుకుంటున్నారు. మీటింగ్, డేటింగ్ ల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ లక్షల్లో దండుకున్న ఉదంతాలపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసుల సంఖ్య పెరుగుతోందని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. కోరుకున్న వారికి మహిళా ఎస్కార్ట్ సేవలను అందిస్తామని చెబుతూ మోసగాళ్లు అమాయకులను వలలో వేసుకుంటున్నారు. ఇలాంటి మాయమాటలతో మోసపోయిన ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తికి కొద్ది రోజుల క్రితం క్యూపి-జెడ్సిసివిబిఎన్ అనే పోర్టల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఒక వివాహితతో జిమ్స్ సమావేశం, డేటింగ్ కావాలంటే తాము చెప్పిన నంబరుకు ఫోన్ చేయాలనేది దాని సారాంశం. ఇందుకు రూ.30 వేలు ఖర్చవుతుందని అందులో ఉంది.

    దీంతో ఆ వ్యక్తి మోసగాళ్లు పంపించిన ఫోన్ నంబర్‌కు కాల్ చేశాడు. కాల్ స్వీకరించిన మహిళ ప్రీతి అని పరిచయం చేసుకుంది. అతడి నుంచి కొన్ని వివరాలను స్వీకరించింది. అనంతరం డేటింగ్ రిజిస్ట్రేషన్ కోసం కొంత డబ్బు చెల్లించాలని చెప్పారు. ఆ తరువాత భద్రత రుసుము కోసం ఎక్కువ మొత్తాన్ని అడిగారు. డబ్బును ఫోన్‌పే ద్వారా చెల్లించాలని చెప్పారు. ఇలా విడతల వారీగా ఆ వ్యక్తి మొత్తం రూ.34,015 చెల్లించాడు. ఆ తర్వాత అతడికి మరో నంబరు నుంచి కాల్ వచ్చింది.

    తాను మహిళ ఇంట్లో డ్రైవర్ అని, డేటింగ్ విషయం బయటకు తెలియకుండా ఉంటాలంటే తనకు రూ.20,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి ఫిర్యాదుదారుడు నిరాకరించగా, డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో మోసపోయినట్టు గ్రహించిన ఫిర్యాదుదారుడు పోలీసులను ఆశ్రయించాడు. డేటింగ్ పేరుతో తనను మోసం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాము డేటింగ్ ప్యాకేజీలను అందిస్తున్నామని చెప్పి రిజిస్ట్రేషన్ కోసం డబ్బు వసూలు చేస్తున్నారు. లొకాంటో.కామ్, ఇండియా డేటింగ్, టిండెర్ వంటి సైట్ల ద్వారా ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవి కాకుండా కాల్ గర్ల్ సేవలందిస్తామని నమ్మించి అందినకాడికి దండుకుంటున్నారు.

    ఇలాంటి మోసాలు వివిధ రకాలుగా ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. వేర్వేరు నంబర్ల నుంచి వీడియో కాల్స్ చేయడం, వారిని నమ్మించడానికి వీడియో ఛాటింగ్ చేయడం, అనుమానం రాకుండా బాధితుల వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేయడం వంటివి చేస్తున్నారు. మరికొంతమంది మోసగాళ్ళు యువతులు, వివాహితలతో మీటింగ్, డేటింగ్ ఏర్పాట్లు చేస్తామని బాధితులను ఆకర్షిస్తారు. రిజిస్ట్రేషన్, సెక్యూరిటీ ఫీజు పేరిట డబ్బు వసూలు చేస్తారు. వివిధ కారణాలు చెప్పి వీలైనంత దోచుకుంటారు. చివరికి బాధితులు డబ్బు ఇవ్వడానికి సిద్దంగా లేమని చెబితే బ్లాక్ మెయిల్ చేస్తారు.

    ఇలాంటి మోసాల బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పరిచయం లేని వ్యక్తుల నుంచి డేటింగ్, మీటింగ్ పేరుతో వచ్చే మెస్సేజ్, కాల్స్‌కు స్పందించకూడదని అన్నారు. బల్స్ ఎస్ఎమ్ఎస్లు, తెలియని నంబర్ల నుంచి వచ్చే లింక్లపై క్లిక్ చేయవద్దని తెలిపారు. బ్యాంకు ఖాతాలు, కార్డుల వివరాలను ఎవరికీ చెప్పకూడదని అన్నారు. వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. తెలియని ఖాతాలకు డబ్బు బదిలీ చేయకూడదని వెల్లడించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: