• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • WOMAN OF NARSAPUR PLAYS KIDNAP DRAMA TO CONFUSE HUSBAND POLICE FINDS VICTIM AK

కిడ్నాప్ అయ్యానంటూ కుటుంబసభ్యులకు ఫోన్.. చివరికి ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Woman Kidnap Drama: కేసు విచారణలో భాగంగా మహిళను విచారించిన పోలీసులకు మహిళ ఊహించని సమాధానం చెప్పింది.

  • Share this:
    తాను కిడ్నాప్ అయ్యానంటూ ఓ మహిళ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. శరవేగంగా ఆమె ఆచూకీపై దృష్టి పెట్టారు. ఆమె ఎక్కడ ఉందో కనిపెట్టారు. అసలు ఆ మహిళ విషయంలో ఏం జరిగిందో తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్‌లో నివాసం ఉండే మస్కత్ బేగం అనే మహిళ శనివారం ఆస్పత్రికి వెళుతున్నానని చెప్పిన ఏడాది వయసు ఉన్న తన కుమారుడిని తీసుకుని బయటకు వెళ్లింది. అయితే ఎంతసేపు అయినా ఆమె ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆమె భర్త అజ్జూతో పాటు అతడి సోదరి ఆమెకు ఫోన్లు చేశారు. వారి ఫోన్ లిప్ట్ చేసిన మస్కత్.. వాళ్లు ఊహించని సమాధానం చెప్పింది.

    తనను, తన కుమారుడిని ఎవరో కిడ్నాప్ సమాధానం ఇచ్చింది. ఆ వెంటనే ఆమె ఫోన్ స్విచాఫ్ అయ్యింది. దీంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన పెరిగిపోయింది. భార్య చెప్పిన విషయం విని షాక్‌కు గురైన భర్త అజ్జూ.. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు స్వయంగా కిడ్నాప్ అయ్యానని చెప్పడంతో.. పోలీసులు శరవేగంగా స్పందించారు. వెంటనే ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్‌ ఆధారంగా జాడ కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో ఆమె ఉన్నట్టు గుర్తించారు. సుచిత్ర ప్రాంతంలో అమె ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆమెను నర్సాపూర్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

    కేసు విచారణలో భాగంగా మహిళను విచారించిన పోలీసులకు మహిళ ఊహించని సమాధానం చెప్పింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వారికి వివరించింది. కొద్ది రోజులుగా తనకు, తన భర్తకు మధ్య గొడవలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఈ కారణంగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయి కిడ్నాప్ అయినట్టు చెప్పినట్టు తెలిపింది. దీంతో భార్యా, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని అందుకే ఇంట్లోంచి వెళ్లిపోయి కిడ్నాప్ డ్రామా ఆడినట్లు వివరించింది, బాధితురాలి చెప్పిన విషయాలు విన్న పోలీసులు.. ఆమెకు, ఆమె భర్తకు కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: