భార్య మటన్ తీసుకురమ్మంటే వెళ్లాడు.. ఆమె వేసిన స్కెచ్‌కి బలైపోయాడు..

వెంకటేశ్ మార్గమధ్యలో నవీన్‌ను ఆపి.. ఇనుప రాడ్‌తో తలపై మోది హత్య చేశాడు. అనంతరం స్కూటీని నవీన్ తలపై పడేసి.. హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు.

news18-telugu
Updated: October 2, 2019, 10:52 AM IST
భార్య మటన్ తీసుకురమ్మంటే వెళ్లాడు.. ఆమె వేసిన స్కెచ్‌కి బలైపోయాడు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహబూబాబాద్ జిల్లా రేగడి తండా సమీపంలో చోటు చేసుకున్న ఇన్నారపు నవీన్ హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న నవీన్ భార్యే అతన్ని హత్య చేయించినట్టు పోలీసులు నిర్దారించారు. ప్రియుడితో కలిసి హత్యకు స్కెచ్ వేసి చంపించినట్టు తేల్చారు. ఈ మేరకు ఆమె,ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఇన్నారపు నవీన్ భార్యతో కలిసి కొన్నేళ్లుగా అక్కడే నివసిస్తున్నాడు. రెండేళ్ల క్రితం నవీన్ భార్యకు వెంకటేశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటినుంచి నవీన్‌కు తెలియకుండా వెంకటేశ్‌తో ఆమె సంబంధం కొనసాగిస్తోంది.అయితే విషయం తెలిసిన నవీన్ ఆమెను మందలించడంతో.. అతని అడ్డు తొలగించుకోవాలని భావించింది.ఇదే క్రమంలో ఇటీవల ఓరోజు తన పుట్టింటికి వెళ్లి మటన్ తీసుకురావాలని పంపించింది. అయితే అప్పటికే ప్రియుడికి
సమాచారం అందించి మార్గమధ్యలో అతన్ని చంపేయాలని చెప్పింది.

చెప్పినట్టుగానే వెంకటేశ్ మార్గమధ్యలో నవీన్‌ను ఆపి.. ఇనుప రాడ్‌తో తలపై మోది హత్య చేశాడు. అనంతరం స్కూటీని నవీన్ తలపై పడేసి.. హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. అయితే మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలంలో దొరికిన మద్యం సీసా, సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేయగా.. అసలు మిస్టరీ వీడింది. నవీన్ భార్యే పథకం ప్రకారం అతన్ని హత్య చేయించినట్టు తేలింది.

First published: October 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు