సిద్దిపేటలో దారుణం.. అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీల కోసం భర్తను చంపిన భార్య

ఈ హత్య కేసును ఒక్కరోజులోనే ఛేదించారు పోలీసులు. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

news18-telugu
Updated: November 12, 2020, 8:14 PM IST
సిద్దిపేటలో దారుణం.. అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీల కోసం భర్తను చంపిన భార్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సిద్దిపేటలో దారుణం వెలుగు చూసింది. అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని, ఆర్థిక లావాదేవీల్లో తన భర్తను ప్రియుడితో కలసి హత్య చేసింది ఓ మహిళ. ఈ హత్య కేసును ఒక్కరోజులోనే ఛేదించారు పోలీసులు. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. దుద్దెడ గ్రామానికి చెందిన మ్యాక శ్రీనివాస్ (45), 15 సంవత్సరాల క్రితం తన భార్య మ్యాక రాజేశ్వరితో కలసి సిద్దిపేట వివేకానంద కాలనీకి వచ్చి స్థిరపడ్డాడు. ఓ ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. శ్రీనివాస్ రైస్ మిల్ లో గుమాస్తాగా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. సంసారం సాఫీగా సాగుతున్న సమయంలో, 4 సంవత్సరాల క్రితం వారి బంధువు, రాజేశ్వరికి బావ వరుసయ్యే ముత్యాల శ్రీనివాస్ వివేకానంద కాలనీకి వచ్చి స్థిరపడ్డాడు. ముత్యాల శ్రీనివాస్ వివేకానంద కాలనీలో ఉంటున్నట్లు రెసిడెన్స్ సర్టిఫికెట్లు రాజేశ్వరి పేరుపై తీసుకున్నాడు. అలాగే డ్వాక్రా గ్రూపులో కూడా చేర్పించింది. అప్పటి నుంచి ముత్యాల శ్రీనివాస్, మ్యాక రాజేశ్వరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుంది. అదే సమయంలో ముత్యాల శ్రీనివాస్ కు డబ్బులు అవసరం ఉన్నాయని రాజేశ్వరి తన భర్త మ్యాక శ్రీనివాస్ పనిచేస్తున్న రైస్ మిల్ యజమాని ద్వారా రూ.35 వేలు అప్పుగా ఇప్పించింది. దానికి వడ్డీతో కలిపి రూ.లక్ష అయ్యాయి. గత వారం పది రోజుల నుంచి డబ్బు విషయంలో రాజేశ్వరి, శ్రీనివాస్ మధ్య ఇంట్లో తగాదాలు జరుగుతున్నాయి.

10-11-2020న సాయంత్రం 4 గంటల సమయంలో నిందితులిద్దరూ కలసి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, తరచుగా డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నాడని, చంపుదామని నిర్ణయించుకున్నారు. రాజేశ్వరి భర్త శ్రీనివాస్ ను తీసుకుని తన బైక్ మీద వెళ్లాడు నిందితుడు శ్రీనివాస్. వెంట మద్యం బాటిల్ కూడా తీసుకెళ్లాడు.

మెట్టు బండ లక్ష్మీనరసింహస్వామి గుడి పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించారు. మ్యాక శ్రీనివాస్ మద్యం మత్తులో నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత నిందితుడు ముత్యాల శ్రీనివాస్ రాజేశ్వరి కి ఫోన్ చేశాడు. నిందితులు ఇద్దరు కలసి శ్రీనివాస్‌ను దుద్దెడ గ్రామ శివారు రాంపల్లి రోడ్డు బీఈడీ కాలేజీ సమీపంలో ఉన్న పత్తి చేనులోనికి తీసుకెళ్లారు. అక్కడ ఇనుప పైపుతో శ్రీనివాస్ తలపైన, ముఖం పైన బలంగా కొట్టారు. దీంతో మ్యాక శ్రీనివాస్ చనిపోయాడు. ఆ తర్వాత నిందితులు ఇద్దరు కలసి హోండా యాక్టివ్ పై బందారం రోడ్లు లోపలికి వెళ్లి ఇనుప పైపును అక్కడ పడేశారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి పోయారు. అయితే, వారు బైక్ మీద వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. దీంతో 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 12, 2020, 8:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading