WOMAN MURDERED BY HUSBAND AND FATHER IN LAWS FOR DOWRY IN BHOJPUR PVN
కట్నం కోసం మహిళను దారుణంగా హత్య చేసిన భర్త,అత్తమామలు!
ప్రతీకాత్మక చిత్రం
Woman Murdered For Dowry : వరకట్న దాహనానికి ఓ వివాహిత బలైపోయింది. తాము అడిగిన కట్నం(Dowry)ఇవ్వలేదనే కోపంతో మహిళను భర్త,అత్తమమాలు కలిసి దారుణంగా హత్య చేశారు.
Woman Murdered For Dowry : వరకట్న దాహనానికి ఓ వివాహిత బలైపోయింది. తాము అడిగిన కట్నం(Dowry)ఇవ్వలేదనే కోపంతో మహిళను భర్త,అత్తమమాలు కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ అమానుష సంఘటన బీహార్(Bihar) రాష్ట్రంలోని భోజ్‌పుర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గతేడాది మే నెలలో భోజ్‌పుర్(Bjojpur)జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరౌలీ గ్రామానికి చెందిన శత్రుఘ్న బింద్‌తో.. బభన్గామా గ్రామానికి చెందిన మమతా దేవికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో మమతా దేవి తల్లిదండ్రులు...అల్లుడికి కట్నం ఇచ్చారు. అయితే పెళ్లిన కొద్ది రోజుల నుంచే మమతా దేవికి అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. నువ్వు ఎక్కువ కట్నం ఇవ్వలేదు..నీ వల్ల మేం చాలా నష్టపోయాం అంటూ మమతాదేవిని వేధించడం మొదలుపెట్టారు భర్త,అత్తమామలు. అయితే అత్తింట్లో వేధింపులు ఉన్నా వాటిని మౌనంగా భరిస్తూ వచ్చింది మమతాదేవి.
అయితే ఇటీవల వ్యాపారం చేసేందుకు రూ.2 లక్షలు తేవాలని అత్తింటివారు మమతాదేవిని వేధించటంతో.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది బాధితురాలు. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం వల్ల వారి డిమాండ్‌ను తీర్చలేకపోయారు మమతాదేవి తల్లిదండ్రులు. మమతా దేవి తల్లిదండ్రులు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు వలసవెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే తాము అడిగిన డబ్బులు పుట్టింటి నుంచి తీసుకురాలేదన్న కోపంతో మమతా దేవిని భర్త, అత్తమామలు కలిసి హత్య చేశారు. ఆ తర్వాత ఆధారాలు లేకుండా చేసేందుకు గుట్టుగా పూడ్చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఓ కారును అద్దెకు తీసుకుని సరిపుర్ విశ్వన్ పుర్ గ్రామం సమీపంలో నది ఒడ్డున పూడ్చేశారు. ఆ తర్వాత కారును పంపించేశారు. కానీ వారు అంతటితో సంతృప్తి చెందలేదు. మృతదేహాన్ని బయటకు తీసి కాల్చేశారు.
అయితే అనుమానంతో కారు డ్రైవర్‌ను కొందరు గ్రామస్తులు పట్టుకుని విచారించగా అసలు విషయం బయటడింది. వెంటనే వారు బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులతో కలిసి వారు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే 90 శాతం మేర మృతదేహం కాలిపోయింది. కేవలం ఎడమ కాలు మాత్రమే మిగిలింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు...మమతాదేవి భర్త శత్రుఘ్న బింద్, మామ రామ్ ప్యార్ బింద్‌పై ముఫాసిల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలి కాలిని స్వాధీనం చేసుకున్న పోలీసులు డీఎన్ఏ, ఫొరెన్సిక్ పరీక్షల కోసం పట్నాకు పంపించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. హత్య వెనుక ఉన్న కారణాలను తెలుసుకునే ప్రయత్నిస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.