హత్యకు దారి తీసిన అక్రమ సంబంధం.. మరో వ్యక్తితో క్లోజ్ గా ఉంటుందన్న కోపంతో..

అక్రమ సంబంధాలు దేశంలో అనేక దారుణాలకు దారి తీస్తున్నాయి. వివాహతర సంబంధాల నేపథ్యంలో అనేక హత్యలు సైతం జరుగుతున్నాయి. తాజాగా తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను ఓ వ్యక్తి కిరాతంకంగా కడతేర్చాడు. మరో వ్యక్తితోనూ ఆ మహిళ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో గొంతు కోసి దారుణంగా చంపేశాడు.

news18-telugu
Updated: November 12, 2020, 9:14 PM IST
హత్యకు దారి తీసిన అక్రమ సంబంధం.. మరో వ్యక్తితో క్లోజ్ గా ఉంటుందన్న కోపంతో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అక్రమ సంబంధాలు దేశంలో అనేక దారుణాలకు దారి తీస్తున్నాయి. వివాహతర సంబంధాల నేపథ్యంలో అనేక హత్యలు సైతం జరుగుతున్నాయి. తాజాగా తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను ఓ వ్యక్తి కిరాతంకంగా కడతేర్చాడు. మరో వ్యక్తితోనూ ఆ మహిళ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో గొంతు కోసి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన భువనగిరి శివారులో బుధవారం అర్థరాత్రి సమయంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పెద్దమాటూరుకు చెందిన లక్ష్మి భర్త చనిపోయాడు. దీంతో ఆ మహిళ హైదరాబాద్ కు వలస వచ్చింది. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.

అయితే ఈ క్రమంలో ఆమెకు అదే గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కుమార్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే లక్ష్మికి విజయ్ అనే మరో యువకుడితోనూ పరిచయం ఏర్పడింది. అయితే ఆ పరిచయం అక్రమ సంబంధంగా మారిందని కుమార్ అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలో లక్ష్మి, కుమార్ ఇద్దరూ బుధవారం హైదరాబాద్‌ నుంచి భువనగిరి శివారులోని ఓ నిర్మాణుష్య ప్రాంతానికి వెళ్లారు.

అక్కడ వీరిద్దరికి విజయ్ విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన కుమార్ లక్ష్మిని గొంతు కోసి చంపేశాడు. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. దీంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Published by: Nikhil Kumar S
First published: November 12, 2020, 9:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading