శాంతి పూజ పేరుతో వివాహితను లొంగదీసుకోవాలని.. చివరికిలా..

మల్లేష్ ఇంటిని పరిశీలించిన ప్రభాకర్.. ఇంట్లో శాంతి పూజ చేయాలని చెప్పాడు.ఇందుకోసం రూ.18వేలకు ఒప్పందం కుదరగా.. మల్లేష్ మొదట రూ.3వేలు అడ్వాన్స్ చెల్లించాడు. దీంతో జులై 26వ తేదీ రాత్రి 10గంటలకు మల్లేష్ ఇంట్లో పూజ చేసేందుకు ప్రభాకర్ తన శిష్యులను వెంటపెట్టుకుని వెళ్లాడు.

news18-telugu
Updated: September 25, 2019, 7:54 AM IST
శాంతి పూజ పేరుతో వివాహితను లొంగదీసుకోవాలని.. చివరికిలా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దొంగతనం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిపోయి.. ఓ జంట మంత్రగాన్ని సంప్రదించారు.ఇంట్లో శాంతి పూజ జరిపించాలని కహానీలు చెప్పిన ఆ మంత్రగాడి ముఠా.. చివరకు ఆ వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టబోయారు. హతాశయురాలైన ఆమె లైంగిక దాడిని ప్రతిఘటిస్తూ ఈల పీటతో దాడిచేయడంతో ముఠాలో కీలక వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన నెల రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా అంతర్గామండలం మొగల్‌పహాడ్‌‌లో మూడారపు మల్లేష్,సరిత దంపతులు చాలాకాలంగా నివాసం ఉంటున్నారు. మల్లేష్ సింగరేణి ఉద్యోగి. ఆర్నెళ్ల క్రితం వీరి ఇంట్లో చోరీ జరిగింది.ఇంట్లోని బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే మల్లేష్ దంపతులు పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు.పోయిన బంగారు ఆభరణాలను తిరిగి ఎలా దక్కించుకోవాలని వాళ్లలో వాళ్లే మదనపడుతున్నారు. ఇంతలో వీరికి పరిచయం ఉన్న ప్రభాకర్ అనే వ్యక్తి కలిసి.. దొంగలను పట్టించే ముఠా ఒకటి తనకు తెలుసని చెప్పాడు.

మంచిర్యాల జిల్లా రెబ్బెన మండలం కొమురవెల్లి గ్రామానికి చెందిన దుర్గం ప్రకాశ్ అనే వ్యక్తిని తీసుకొచ్చి పరిచయం చేశాడు. మల్లేష్ ఇంటిని పరిశీలించిన అతను.. ఇంట్లో శాంతి పూజ చేయాలని చెప్పాడు.ఇందుకోసం రూ.18వేలకు ఒప్పందం కుదరగా.. మల్లేష్ మొదట రూ.3వేలు అడ్వాన్స్ చెల్లించాడు. దీంతో జులై 26వ తేదీ రాత్రి 10గంటలకు మల్లేష్ ఇంట్లో పూజ చేసేందుకు ప్రభాకర్ తన శిష్యులను వెంటపెట్టుకుని వెళ్లాడు.

పూజ సమయంలో.. మల్లేష్ భార్య సరితలో లోపం ఉందని ఆమెను పూజలో కూర్చోపెట్టాలని ప్రభాకర్ అన్నాడు.దాంతో సరితను పూజలో కూర్చోబెట్టి మల్లేష్ ఇంట్లోకి వెళ్లిపోయాడు. అదే అదనుగా భావించి ప్రభాకర్ ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ప్రతిఘటించిన సరిత పక్కనే ఉన్న ఈలపీటతో అతని తలపై దాడి చేసింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందగా..అతని శిష్యలు పారిపోయారు. అనంతరం అతని మృతదేహాన్ని మల్లేష్,సరిత బసంత్ నగర్‌లోని రైల్వే బ్రిడ్జి పైనుంచి కిందకు పడేశారు.మరోవైపు నెల రోజుల క్రితం రెబ్బెన పోలీస్ స్టేషన్‌లో దుర్గం ప్రకాశ్ మిస్సింగ్ కేసు నమోదైంది. విచారణలో భాగంగా పోలీసులు మల్లేష్ దంపతులను విచారించినప్పటికీ.. తమకేమీ తెలియదనే చెప్పారు. అయితే ఎప్పటికైనా నిజం బయటపడుతుందన్న భయంతో మల్లేష్,సరిత ఇటీవల అంతర్గాం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
First published: September 25, 2019, 7:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading